`ఎన్టీఆర్ 30`కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్‌.. గోలెత్తిపోతున్న ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌!?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ జంట‌గా న‌టిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం `ఎన్టీఆర్ 30`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విల‌న్ గా ఖ‌రారు అయ్యారు.

ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. కొత్త షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో వచ్చే వారం నుంచి ప్రారంభించబోతున్నారు. పది రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్‌పై మేజర్ ఫైరింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తారని సమాచారం. ఇక‌పోతే ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ తెర‌పైకి వ‌చ్చింది.

అదేంటంటే.. ఈ సినిమాకు `దేవ‌ర‌` అనే టైటిల్ ను మేక‌ర్స్ లాక్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కొర‌టాల రాసుకున్న క‌థ‌కు ఆ టైటిల్ ప‌ర్ఫెక్ట్ గా సూట్ అవుతుంద‌ట‌. అందుకే ఆ టైటిల్ ను ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఇక అన్నీ సెట్ అయితే మే 20న ఎన్టీఆర్ బ‌ర్త్‌డే కానుక‌గా టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉంటుంద‌ని టాక్ న‌డుస్తోంది. ఈ విష‌యం తెలిసి ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ గోలెత్తిపోతున్నారు. ఎందుకంటే, `దేవ‌ర‌` టైటిల్ ని పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెర‌కెక్కుతున్న మ‌ల్టీస్టార‌ర్ కు పెట్ట‌బోతున్నార‌ని గ‌త కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, ఇప్పుడు అనూహ్యంగా ఎన్టీఆర్ ఆ టైటిల్ కొట్టేయ‌డంతో ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

Share post:

Latest