ఈ దెబ్బతో పొలిటికల్ పై క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్..!!

టాలీవుడ్ లో ఒకప్పుడు నటుడుగా పలు చిత్రాలలో కమెడియన్ గా నటించి మంచి పేరు సంపాదించారు బండ్ల గణేష్.. అయితే అనుకోకుండా గబ్బర్ సింగ్ సినిమాకి నిర్మాతగా మారి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా కొన్ని కోట్ల రూపాయల లాభాన్ని అందుకున్నారు. ఆ తర్వాత నిర్మాతగా పలు చిత్రాలకు వ్యవహరించి బాగానే సక్సెస్ అయ్యారు బండ్ల గణేష్. ఆ తర్వాత పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో బాగానే యాక్టివ్గా పనిచేశారు. కొన్ని కారణాల చేత రాజకీయాలకు దూరంగా ఉన్న బండ్ల గణేష్ ఇప్పుడు మరొకసారి పొలిటికల్గా యాక్టివ్గా మారారు.

తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ధైర్యంగా పౌరుషంగా రాజకీయాలు చేస్తానంటూ ప్రకటించారు.. బానిసత్వంతో కూడిన రాజకీయాలు చేయనని కూడా తెలిపారు బండ్ల గణేష్. బండ్ల గణేష్ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.ఇప్పుడు తాజాగా మీరు మా రాహుల్ గాంధీని ఇల్లు కాలి చేయిస్తే కర్ణాటక ప్రజలు రాష్ట్రాన్ని ఖాళీ చేయించారంటూ ఒక సెటైరికల్ కామెంట్లు చేశారు బండ్ల గణేష్.

నాలుగు సంవత్సరాల క్రితం నాటి ఒక క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునివ్వడంతో దాని కారణంగా చూపిస్తూ ఎంపీగా ఆయనపై అనర్హత వేటు కూడా వేశారు. వీటితోపాటు ఇల్లు కూడా ఖాళీ చేయించారు.అంతేకాకుండా మదర్స్ డే సందర్భంగా తన తల్లితోపాటు తెలంగాణ తల్లి సోనియమ్మ అంటూ సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు బండ్ల గణేష్. డీకే శివకుమార్ పార్టీ కోసం చాలా కష్టపడ్డారని ఆయన సీఎం చేయాలని ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పెద్దలను రిక్వెస్ట్ చేశారు బండ్ల గణేష్. దీన్ని బట్టి చూస్తే తిరిగి కాంగ్రెస్ లోకి రండి ఇచ్చే అవకాశాలు బండ్ల గణేష్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఏ విషయంపై మరో కొద్ది రోజుల్లో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Share post:

Latest