తొలిసారి త‌న‌యుడిని చూపించిన న‌టి పూర్ణ.. ఎంత క్యూట్ గా ఉన్నాడో చూశారా?

టాలెంటెడ్ బ్యూటీ పూర్ణ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వెండితెర‌పై కాకుండా బుల్లితెర‌పై పలు టీవీ షోల‌కు జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రించి మంచి గుర్తింపు సంపాదించుకున్న పూర్ణ‌.. గ‌త ఏడాది వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దుబాయ్‌ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ సీఈవో అయిన షానిద్ ఆసిఫ్ అలీతో ఆమె ఏడ‌డుగులు వేసింది.

దుబాయ్‌లో వీరి వివాహం అత్యంత ఘనంగా జరిగింది. పెళ్లి జ‌రిగిన కొద్ది నెల‌ల‌కే ప్రెగ్నెంట్ అయిన పూర్ణ‌.. ఈ ఏడాది పండంటి మ‌గబిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. గ‌త నెల ఆరంభంలో పూర్ణ దంప‌తులు త‌మ ఫ‌స్ట్ చైల్డ్ కు వెల్క‌మ్ చెప్పారు. ప్ర‌స్తుతం మాతృత్వాన్ని ఆస్వాధిస్తున్న పూర్ణ‌.. తొలిసారి త‌న‌యుడిని అంద‌రికీ చూపించింది.

నిన్న‌ మదర్స్ డే సంద‌ర్భంగా కొడుకు, భర్తతో పాటు ఫోటో దిగి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. `ది ప్రిన్స్` అని త‌న‌యుడిని ఉద్ధేశిస్తూ కామెంట్ పెట్టింది. దీంతో పూర్ణ పోస్ట్ క్ష‌ణాల్లో వైర‌ల్ అయింది. పూర్ణ త‌న‌యుడుని చూసి నెటిజ‌న్లు బాబు చాలా క్యూట్ గా ఉన్నాడు, సేమ్ త‌ల్లి పోలికే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కెరీర్ విష‌యానికి వ‌స్తే.. పూర్ణ ఓవైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు వెబ్ సిరీస్ లు చేస్తోంది. రీసెంట్ గా `ద‌స‌రా` మూవీతో ఈ బ్యూటీ మెరిసింది.

 

Share post:

Latest