ప్రస్తుతం వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. తెలుగు సినిమాలతో పాటుగా, డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
• అన్ని మంచి శకునములే
నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘అన్ని మంచి శకునములే’ సినిమాలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ నటించారు. ఈ సినిమాని మే 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
• బిచ్చగాడు 2
విజయ్ అంటోని కెరీర్‌లోనే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమా బిచ్చగాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్‌గా బిచ్చగాడు 2 సినిమాని తీసుకురానున్నారు. విజయ్ అంటోని హీరోగా నటిస్తూ, దర్శకుడిగా బాధ్యతలు వహిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది. బిచ్చగాడు 2 సినిమా మే 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
• ఫాస్ట్ ఎక్స్
పాన్ ఇండియా లెవల్‌లో సినీ ప్రేక్షకులకు పరిచయమైన సిరీస్ ‘ఫాస్ట్ అండ్ ప్యూరియస్’. ఆ సిరీస్‌కి కొనసాగింపుగా రూపొందిన ‘ఫాస్ట్ ఎక్స్’ సినిమా మే 19న థియేటర్లలో సందడి చేయనుంది.
ఇక ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు థియేటర్స్ లో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. మరీ వెబ్ సిరీస్ లలో అయినా మెప్పిస్తాయో లేదో చూడాలి.
• ఏజెంట్
అక్కినేని అఖిల్ నటించిన చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోలేకపోయింది. ఇది మే 19 న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
• డెడ్ పిక్సెల్
పెళ్లి తరువాత మెగా డాటర్ నిహారిక ‘డెడ్ పిక్సెల్ ‘ వెబ్ సిరీస్ లో కనిపించబోతుంది. ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ హాట్‌స్టార్‌లో ఈ నెల 19 న సందడి చెయ్యనుంది.
ఇకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళం మూవీ అయాలవాషి మే 19న, హిందీ మూవీ కథల్ మే 19న, ఇంగ్లీష్ మూవీ బయీ అజైబి మే 19న, ఇంగ్లీష్ డ్రామా మ్యూటెడ్ మే 19న
నామ్ సీజన్-2 మే 1న రిలీజ్ కానున్నాయి. సోనీ లివ్‌లో మలయాళం ఫిల్మ్ కడిన కదోరమీ అంద కదహం మే 19న,
అమెజాన్ ప్రైమ్ వీడియోలో మోడ్రన్ లవ్ చెన్నై (తమిళ్) మే 18న విడుదలవుతాయి.