ప్రత్యేకమైన పూజలు చేయిస్తున్న ఆదాశర్మ.. అందుకేనా..?

తాజాగా విడుదలైన ది కేరళ స్టోరీ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ఆదాశర్మ. ఈ సినిమా విడుదలై పెను సంచలనాలను సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని భాషలలో కలెక్షన్లు బాగానే రాబడుతోంది.ఇదే సమయంలో ఈ సినిమా కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. హీరోయిన్ ఆదాశర్మకు గతంలో నటించిన సినిమాల కంటే ఈ సినిమాతో మరింత క్రేజ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోని ఈమెకు సంబంధించిన పలు వీడియోలు ఫోటోలు సైతం తెగ వైరల్ గా మారుతున్నాయి.

The energy that allows me to accept bouquets, face bans', Adah Sharma rings  in her 31st birthday with Shiv Tandav Strotam - India Today

తాజాగా ఈమె శివాలయంలో పూజలు చేయిస్తున్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. తన 31 వ పుట్టినరోజు సందర్భంగా శివాలయంలో ప్రత్యేకమైన పూజలు చేయించారు.. దీంతో గర్భగుడిగా శివుడికి దగ్గరగా కూర్చుని శివతాండవం మంత్రాలను చదువుతూ ఉన్నట్టుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారడం జరిగింది ఇదే భక్తి భావన యంత్రాన్ని ఉచ్చరిస్తున్న తీరును నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.

నిన్నటి రోజున ఈ అమ్మడికి యాక్సిడెంట్ గురయ్యింది ప్రస్తుతం ముంబైలో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. తన ఆరోగ్యంపై ఆదాశర్మ ట్విట్టర్లో స్పందిస్తూ..తనకు బాగానే ఉందని ఆక్సిడెంట్ గురించి చాలా మంది మెసేజ్లు చేస్తున్నారు మా టీం మేమందరము చాలా బాగానే ఉన్నాము అంటూ తెలియజేసింది మీరు చూపుతున్న ఈ ప్రేమకు కృతజ్ఞతలు అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

Share post:

Latest