విల‌న్‌గా మ‌హేష్.. బాక్సాఫీస్ బ‌ద్ద‌ల‌వ్వాల్సిందే…!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్ లో 28వ సినిమా గా వస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ పూజ హెగ్డే, శ్రీలీల‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

SSMB28 Motion Teaser | SSMB28 Teaser | SSMB28 Trailer | Movie Mahal -  YouTube

ఈ సినిమాలో మ‌హేష్ డ్యూయల్ రోల్‌లో న‌టించ‌బోతున్న‌డు. ఇప్ప‌టికే చాల వ‌ర‌కు షూటింగ్ కంప్లిట్ అయ‌న ఈ సినిమా 2024 సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మ‌హేష్ నెగిటివ్ షేడ్స్‌లో న‌టించ‌బోతున్నాడు. విల‌న్స్ పై మ‌హేష్ చేసే విల‌నిజం సినిమాకే ఎంతో హైల‌ట్‌గా ఉండ‌బోతుంద‌ట‌. మ‌హేష్- త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌స్తున్నా ఈ సినిమాపై భారీ అంచ‌న‌లు ఉన్నాయి.

SSMB 28: 'Finally good news,' exclaim Mahesh Babu fans - here's why

ఈ సినిమాను తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవ‌ల్‌లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్‌ ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇప్ప‌టికే మ‌హేష్ త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన రెండు సినిమాలు ప్రేక్ష‌కుల‌ను భాగా అల‌రించాయి. ఇప్పుడు వ‌స్తున్నా మూడో సినిమా కూడా ఎలాంటి అంచాల‌ను అందుకుంటుందో చూడాలి. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన ప‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా అభిమానుల‌ను ఎంత‌గానో అక‌ట్టుకుంది.

Share post:

Latest