HBD..ఫస్ట్ టైం ఇలాంటి ఎంట్రీ తో రామ్ పోతినేని.. టీజర్ అదుర్స్..!!

దేవదాసు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరో రామ్ పోతినేని ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ హీరోగా పేరు సంపాదించారు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో చేస్తూ టైర్ -2 హీరోలలో మంచి పేరు సంపాదించారు. తాజాగా డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇక బోయపాటి శ్రీను హీరోలను ఎలాంటి ఎలివేషన్ చూపిస్తారని విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..

Happy Birthday To Ustaad Ram Pothineni | cinejosh.com

గతంలో ఎంతోమంది హీరోలను సైతం డిఫరెంట్ లుక్కులు చూపించడం జరిగింది బోయపాటి శ్రీను. తాజాగా ఇప్పుడు రామ్ పోతినేని లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. గత కొన్ని సినిమాల నుంచి హీరో రామ్ మాస్ హీరోగా పేరు తెచ్చుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగా తన డాన్సింగ్, ఫైట్ లుక్స్ అన్నీ కూడా మార్చేస్తున్నారు రామ్. ఇక తన 20వ చిత్రంని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతాన్ని థమన్ అందిస్తూ ఉన్నారు.

ఈ రోజున రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్డేటను విడుదల చేసింది చిత్ర బృందం. గత చిత్రం పోలీస్ పాత్రలో నటించిన దివారియర్ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ రోజున రామ్ పోతినేని బర్త్డే సందర్భంగా BOYAPATIRAPO సినిమా నుంచి పేరుతో ఒక టీజర్ ను విడుదల చేశారు. ఇందులో దున్నపోతుతో ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని పవర్ ఫుల్ డైలాగ్ లతో అదరగొట్టేస్తున్నారు. మొదటిసారి రామ్ పోతినేని ఇలా ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి టీజర్ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest