కొత్త వ్యాపారంలోకి న‌య‌న‌తార.. లేడీ సూప‌ర్ అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గ‌త ఏడాది కోలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత విఘ్నేష్ శివ‌న్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన నాలుగు నెల‌ల‌కే ఈ దంప‌తులు స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు క‌వ‌ల మ‌గ పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు. త‌ల్లి అయినా స‌రే న‌య‌న‌తార కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది.

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో ఈ బ్యూటీ షారుఖ్ ఖాన్ సరసన `జవాన్` చిత్రంలో నటిస్తోంది. ఇదే న‌య‌న్ తొలి హిందీ సినిమా. ఈ చిత్రానికి న‌య‌న‌తార ఏకంగా రూ. 10 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేస్తోంది. అయితే హీరోయిన్ గానే కాకుండా నిర్మాత‌గా కూడా స‌త్తా చాటుతున్న న‌య‌న‌తార‌.. వ్యాపార రంగంలోనూ హ‌వా చూపిస్తోంది.

ఆల్రెడీ అనేక వ్యాపారాల్లో న‌య‌న‌తార పెట‌బ‌డులు పెట్టింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మ‌రో కొత్త వ్యాపారం ప్రారంభించ‌బోతోంది. నయనతార థియేటర్ బిజినెస్ లోకి రాబోతోంద‌ని తెలుస్తోంది. చెన్నైలో మూతపడ్డ అగస్త్య థియేటర్ ని నయన్ కొనుగోలు చేసి దాని స్థానంలో విలాసవంతమైన, అత్యాధునికమైన కొత్త మల్టిఫ్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Share post:

Latest