`క‌స్ట‌డీ` ప్ర‌మోష‌న్స్ లో చైతూ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదు తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య నేడు `కస్టడీ` మూవీతో ప్రేక్షకుల‌ను పలకరించాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్ల‌ర్ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే అరవింద్‌ స్వామి, శరత్ బాబు, ప్రియమణి తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు.

తెలుగు, తమిళ భాషల్లో అట్టహాసంగా నేడు విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వ‌స్తున్నాయి. అభిమానులు సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అంటుంటే.. సాధార‌ణ సినీ ప్రియులు యావ‌రేజ్ అంటున్నారు. ఇదిలా ఉంటే.. గత రెండు వారాల నుంచి కస్టడీ మూవీని మేకర్స్ భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

నాగచైతన్య కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అయితే ప్రమోషన్స్ లో చైతు పెట్టుకున్న ఓ వాచ్‌ అందర్నీ ఆకర్షించింది. ఆడెమర్స్ పిగ్యెట్ రాయల్ ఓక్ క్రోనోగ్రాఫ్ వాచ్ ని చైతూ త‌న చేతికి ధ‌రించాడు. ఈ బ్రాండెడ్ వాచ్ ఖరీదు వింటే కళ్ళు తేలేస్తారు. ఎందుకంటే నాగచైతన్య ఈ వాచ్ ను ఏకంగా రూ. 41 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాడు. ఈ విషయం తెలిసి నెటిజ‌న్లు నోరెళ్ల‌బెతున్నారు.

Share post:

Latest