బాహుబలిని మించి గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న ‘ఆదిపురుష్’ టీం?

పాన్ ఇండియన్ స్టార్, తెలుగు ప్రజల రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో భారీ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న చిత్రం ”ఆదిపురుష్”. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ ఇండియన్ సైతం ఎదురు చూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. మరో నెల రోజుల్లో ఈ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు రాగా మేకర్స్ ఈ నెల రోజులను బాగా సద్వినియోగం చేసుకుని వీలైనంత గ్రాండ్ గా ప్రమోషన్స్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే బాహుబలిని మించి గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి.

భారీ మైథలాజికల్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ లంకేశ్వరుడిగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా నుండి ఇటీవలే ట్రైలర్ ను రిలీజ్ చేసి దుమ్ములేపిన సంగతి అందిరికీ తెలిసినదే. ఈ సినిమా టీజర్ కంటే కూడా ట్రైలర్ బాగా ఉండడంతో ఫాన్స్ ఐతే తెగ ఖుషీ అయిపోతున్నారు. ఈ ట్రైలర్ కట్ ఎలా ఉంటుందో అని అనుకున్న ఫ్యాన్స్ కు ఓం రౌత్ ‘జై శ్రీరామ్’ అనే నినాదం ఫ్యాన్స్ చేసేలా చేసాడు.

టీజర్ తో నిరాశ పరిచిన డైరెక్టర్ ఇప్పుడు ట్రైలర్ తో సినిమాలో చాలా ఉంది అనిపించేలా చేసాడు. ఇక ముందు ముందు కూడా ఇదే రేంజ్ లో ప్రమోషన్స్ ఉండబోతున్నాయని టాక్ నడుస్తోంది. తాజాగా అందుతున్న వార్తల ప్రకారం… ఈ సినిమా ప్రమోషన్స్ ను భారీ లెవల్లో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. జూన్ మొదటి వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత దేశంలో ప్రధాన నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించ నున్నట్టు తెలుస్తుంది. కాగా జూన్ 16న ఈ సినిమా గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి అందరికీ విదితమే.

Share post:

Latest