స్టేజిపై బన్నీకి సర్‌ప్రైజ్.. కాళ్లకు దండం పెట్టేశాడు..

ప్రతీ ఒక్కరి జీవితంలో మర్చిపోలేని ముఖ్యమైన వ్యక్తి ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ఎన్ని ఏళ్లు అయినా వాళ్లు చెప్పిన మాటలు, వాళ్లు చేసిన సహాయం వారిని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు వాళ్లు ఎక్కడ, ఎలా ఉన్నారో తెలుసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. అలాంటి సమయంలో వాళ్ళు మన కంటికి కనబడితే ఆ ఆనందం మాటలో చెప్పలేనిది. ఇలాంటి సంఘటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా ఎదురైంది.

చెన్నైలో జరిగిన ఒక ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్ బిహైండ్‌వుడ్స్ వారు ప్రముఖ మూవీ ఆర్టిస్టులను పిలిచి అవార్డ్స్ అందించారు. ఈవెంట్స్ లో అందరు కలిసి బన్నీ కి సర్‌ప్రైజ్ ఇచ్చారు. అది కూడా తాను ఎంతగానో అభిమానించే ఒక వ్యక్తిని 30 ఏళ్ళ తరువాత కలుసుకున్నాడు ఐకాన్ స్టార్. చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు బన్నీ. ఆ ఈవెంట్‌లో ఆయన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని కలిసారు. ఆమె వల్ల బన్నీ ఎన్నో నేర్చుకున్నారట. అల్లు అర్జున్ జీవితంలో ఆమె స్థానం వేరే అని అన్నాడు. అసలు ఆమె ఎవరు అని అనుకుంటున్నారా?

ఆమె మరెవరో కాదు అల్లు అర్జున్ స్కూల్ టీచర్. ఆమెని చూడగానే అల్లు అర్జున్ పొగడ్తలతో ముంచేత్తారు. బన్నీ చిన్నతనంలో చెన్నైలో చదుకునే రోజుల్లో ఆ టీచర్ బన్నీని ఎంతగానో ప్రోత్సహించే వారట. స్టేజ్ పై బన్నీ టీచర్ ని చూడగానే షాక్ అయిపోయి, ఆమె స్టేజ్ మీదకి రాగానే కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. బన్నీ మాట్లాడుతూ ‘ ఆమె పేరు అంభిక కృష్ణన్. నేను 3 వ తరగతి చదివేటప్పుడు నాకు పాటలు చెప్పిన టీచర్. 30 ఏళ్ళ తరువాత మళ్ళీ మేడం ని చూడడం చాలా ఆనందంగా ఉంది ‘ అని చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Share post:

Latest