మహేశ్ బాబు లో ఈ టాలెంట్ కూడా ఉందా? ఎవ్వరికీ తెలియని సీక్రెట్ చెప్పేసిన బాబాయ్..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా ఆయన కమిట్ అయిన ప్రాజెక్టులు చూస్తుంటే జనాల మతులు పోతున్నాయి . ఒకదానికి మించి ఒక ప్రాజెక్ట్ ఉండడంతో ఈగర్ గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే ఫోర్ కె ప్రింట్ ద్వారా మహేష్ బాబు తండ్రి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన “మోసగాళ్లకు మోసగాడు “..సినిమా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ .

ఈ క్రమంలోనే చిత్ర ట్రైలర్ కూడా విడుదల చేశారు . ఆ ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంది. మే 31న సూపర్ స్టార్ కృష్ణ 81 పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. దీంతో చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాలలో పాల్గొంటున్న మహేష్ బాబు బాబాయ్ ఆదిశేషగిరిరావు పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే మహేష్ బాబుకి సంబంధించిన టాప్ సీక్రెట్ లు కూడా రివీల్ చేశారు .

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..” మహేష్ బాబు నాకు చిన్నప్పటినుంచి తెలుసు ..చాలా అల్లరివాడు ..చాలా టాలెంటెడ్.. మహేష్ బాబు నటించిన వంశీ సినిమాని ప్రొడ్యూస్ చేసింది నేనే ..మహేష్ బాబు ముందు నుంచి అమ్మకూచి,, నమ్రతల – మహేష్ పెళ్లి జరగడానికి మెయిన్ రీజన్ కూడా వాళ్ళ అమ్మ ఇందిరాదేవి గారే.. అయితే మహేష్ బాబు కేవలం నటుడే కాదు మంచి టాలెంటెడ్ పర్సన్.. చదువుల్లో గోల్డ్ మెడలిస్ట్ .. అంతేకాదు మహేష్ బాబు లో ఎవరికీ తెలియని టాలెంట్ కూడా ఉంది . మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవ్వరినైనా ఇట్టే మిమిక్రీ చేయగలడు అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

 

Share post:

Latest