పవన్ కళ్యాణ్ పంజా సినిమాకు మొదట అనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సినిమాలలో పంజా కూడా ఒకటి.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జంటగా సారా జేన్ డియాస్, అంజలి లవానియా హీరోయిన్లుగా నటించారు. బాహుబలి సినిమాలను నిర్మించిన ఆర్క మీడియా ఈ సినిమాను నిర్మించింది. యువన్ శంకరాజా ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించడమే కాకుండా సింగర్ గా కూడా మారాడు. ఈ సినిమాలో పాపారాయుడు అంటూ వచ్చే పాటను పవన్ కళ్యాణ్ ఆలపించాడు. 2011లో భారీ అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా కన్నా ముందే కొమరం పులి, తీన్‌మార్ వంటి వరుస ప్లాప్‌లను తన ఖాతాలో వేసుకుని తీవ్ర నిరాశలో ఉన్న పవన్ కళ్యాణ్ ను ఈ సినిమా మరింత కృంగదీసింది.

Ajith Kumar's Doctor Reveals That The Actor Was Close To Getting Paralysed  Once

బయర్లకు భారీ నష్టాలులు మిగిల్చింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అసలు పంజా మూవీకి ఫస్ట్ ఛాయిస్ పవన్ కళ్యాణ్ కాదట.. మొదట ఈ సినిమా కథ ఓ కోలీవుడ్ స్టార్ హీరో వద్దకు వెళ్ళగా ఆ హీరో రిజెక్ట్ చేశారట. పంజా వంటి డిజాస్టర్ నుంచి తెలివిగా తప్పించుకున్న ఆ హీరో మరెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్.. ముందుగా ఈ సినిమా దర్శకుడు విష్ణువర్ధన్ ఈ స్టోరీని అజిత్ వద్దకు తీసుకువెళ్లారట.

Pawan Kalyan is interested in acting with Ajith Kumar - India Today

అయితే కథ విన్న అజిత్ ఇతర సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పి ఆ సినిమాకు సున్నితంగా నో చెప్పాడట. ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌ద్ద‌కు వెళ్ల‌గా.. క‌థ న‌చ్చ‌డంలో వెంట‌నే ఆయ‌న‌కు ఓకే చెప్పారు. క‌ట్ చేస్తే సినిమా బిగ్ డిజాస్ట‌ర్ అయింది. అయితే ఈ సినిమా త‌ర్వాత `గ‌బ్బ‌ర్ సింగ్`తో ప‌వ‌న్ పెద్ద హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కారు.

Share post:

Latest