శర్వానంద్-రక్షిత్ రెడ్డి.. పెళ్లి డేట్ ఫిక్స్..!!

తెలుగు హీరో శర్వానంద్ తాజాగా పెళ్లికి సిద్ధమయ్యాడనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. శర్వానంద్ ,రక్షిత్ రెడ్డి ఎంగేజ్మెంట్ అయ్యి ఇప్పటికి చాలా నెలలు కావస్తోంది. ముఖ్యంగా తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డి తో శర్వానంద్ నిశ్చితార్థం జనవరిలో జరిగింది.. అయితే ఇటీవల ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యిందంటే వార్తలు ఎక్కువగా వినిపించాయి.. అయితే ఇందులో నిజం లేదని మ్యారేజ్ కు సంబంధించిన విషయంపై ఇద్దరూ హ్యాపీగా ఉన్నారని శర్వానంద్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

Clarification on Sharwanand and Rakshita's Wedding

శర్వానంద్ సినిమాల షూటింగ్లో కారణం వల్ల వీరి పెళ్లి ఢిలే అవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు పెళ్లికి సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా మ్యారేజ్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూన్-3 వ తేదీన వివాహం చేసుకోవడానికి ఫిక్స్ అయినట్లు సమాచారం. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పటికే చాలా ఘనంగా ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి యూఎస్ఏ లో సాఫ్ట్వేర్ గా పనిచేస్తోంది. ఇక వీరి నిశ్చితార్థానికి ఎంతోమంది సినీ ప్రేమికులు రాజకీయ నాయకులు కూడా హాజరు కావడం జరిగింది. శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్యతో ఒక సినిమాలో చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చేరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 40 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం దీంతో ఇప్పుడు అతి త్వరలోనే పెళ్లికి సిద్ధం కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

Share post:

Latest