టాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో ఫ్యామిలీలు చిత్ర పరిశ్రమలో అగ్ర కుటుంబాలగా కొనసాగుతున్నాయి. ఇక అందులో మెగా- నందమూరి ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. అలాగే దగ్గుబాటి, అక్కినేని, ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కూడా హీరోలుగా మహేష్ బాబు, నాగార్జున వెంకటేష్ టాలీవుడ్లో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. అలాగే మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు తర్వాత ఆయన ఇద్దరు కొడుకులు చిత్రపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అంతగా సక్సెస్ అవ్వలేకపోయారు.
మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. మంచు లక్ష్మి కేవలం సినిమాల్లోనే కాకుండా కొన్ని టాక్ షోలకి కూడా వ్యాఖ్యాతగా చేసింది. ఈ విషయం ఇలా ఉంచితే మంచు లక్ష్మి మాట్లాడే విధానంపై ఎన్నో ట్రోల్స్ వస్తూ ఉంటాయి.. ఆమె తెలుగు మాట్లాడటం మానేసి అమెరికన్ ఇంగ్లీష్ యాసనే ప్రతి ఒక్కరు వెక్కిరిస్తూ ఉంటారు. అచ్చ తెలుగు అమ్మాయి అయ్యుండి కూడా తెలుగు భాష రానిట్టుగా ఆమె మాట్లాడటం వల్లే ఆమె ఎప్పుడూ ట్రోల్స్ కు గురవుతూ ఉంటుంది.
ఇక ఇప్పుడు ఈ విషయం పక్కనపడితే మంచు లక్ష్మి చాలా రోజుల నుంచి ఇండియాలోనే ఉంటుంది. అంతేకాకుండా తన భర్త అమెరికాలో ఉంటారు. ఏ ఫంక్షన్లకి వెళ్లిన పార్టీలకు వెళ్లిన ఎక్కడ చూసినా మంచు లక్ష్మి ఒంటరిగానే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కొంతమంది మంచు లక్ష్మీ తన భర్తకి విడాకులు ఇచ్చేసింది అందుకే దూరంగా ఉంటుందని కొన్ని వార్తలు వైరల్‌గా మారాయి.
ఈ వార్తలు గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి ఆ వార్తలకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి మాట్లాడుతూ.. తన భర్తతో విడాకులు తీసుకున్నాను అనే వార్తలు నా దగ్గరికి కూడా వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. అయితే నా భర్త అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన చాలా సంవత్సరాలు నుంచి అక్కడే ఉంటున్నారు.
కానీ నేను నా భర్తతో కలిసి ఉండడానికి లాస్ ఏంజల్స్ కి వెళ్ళినప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అందుకే నేను మళ్ళీ సినిమాల్లో చేస్తాను అని అనడంతో నీకు ఏది ఇష్టం అనిపిస్తే అదే చేయమని నా భర్త నాకు చెప్పాడు. దాంతో మళ్లీ ఇండియాకి వచ్చి సినిమాల్లో చేస్తున్నాను. ఇక మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఏమీ లేవు.. మా మధ్య ఉన్న అనుబంధం ఎవరికి అంత ఈజీగా అర్థం కాదు. ఖాళీ సమయం లో ఇక్కడికి రా అని చెప్పాడు.మా ఇద్దరి మధ్య అంత ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.