ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ తేజ..!!

టాలీవుడ్ లో హీరో ఉదయ్ కిరణ్ మరణ వార్త ఇప్పటికి డెత్ మిస్టరీగానే ఉందని చెప్పవచ్చు.. అయితే ఈయన మరణ వార్త గురించి అన్ని తెలిసిన డైరెక్టర్ తేజ మాత్రం ఈ విషయంపై ఎప్పుడు నోరు మెదపలేదన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా డైరెక్టర్ తేజ తెరకెక్కించిన అహింస సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ ఉదయ్ కిరణ్ మిస్టరీ గురించి చెప్పమని యాంకర్ అడగగా స్పందించడం జరిగింది.. ఆ విషయం గురించి నేను చెబుతాను కానీ కొందరు మీరే చెప్పండి అని అమాయకంగా యాక్ట్ చేస్తున్నారని తేజ సమాధానం ఇచ్చారు.

Teja To Direct Uday Kiran Biopic! | cinejosh.com
అయితే అంతకుముందే ఉదయ్ కిరణ్ గురించి ఏదైనా ఒక్క మాట చెప్పాల్సిరాగా పాపమని తెలిపారు తేజ. ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయాడు కారణం తనకు తెలుసు అని తేజ గత ఏడాది ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ విషయం తెలిసే యాంకర్ ప్రశ్నించడం జరిగింది. ఉదయ్ కిరణ్ ను తెరపైకి తీసుకువచ్చింది డైరెక్టర్ తేజ చిత్రం సినిమాతో ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత నువ్వు నేను, అవునన్నా కాదన్న వంటి సినిమాలను తెరకెక్కించారు ఈ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలుగా నిలిచాయి.

ఇక అహింస సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఈ చిత్రాన్ని డి సురేష్ బాబు కుమారుడు అభిరామ్ నటిస్తూ ఉన్నారు ఈ చిత్రంలో రజత్ బేడి, గీతిక, సదా, కమల్ కామరాజు తదితరులు నటిస్తూ ఉన్నారు ఈ సినిమా జూన్ రెండవ తేదీన విడుదల కాబోతోంది. మరి రాబోయే రోజుల్లో డైరెక్టర్ తేజ ఈ విషయాన్ని తెలుపుతారేమో చూడాలి మరి.

Share post:

Latest