కోలీవుడ్ టాలీవుడ్లో మంచి మార్కెట్ ఉన్న హీరోలలో చీయాన్ విక్రమ్ కూడా ఒకరు.. విక్రమ్ ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు. ముఖ్యంగా తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటికి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.. విక్రమ్ తెలుగులో శివపుత్రుడు అనే సినిమా ద్వారా మొదటిసారిగా మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత అపరిచితుడు సినిమా విడుదలై విక్రమ్ క్రేజీని పెంచేసింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ తమిళం లో అన్నియన్ పేరుతో విడుదల చేశారు.

తెలుగులో మాత్రం అపరిచితుడు పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేయడంతో ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అప్పట్లో సుమారుగా ఈ సినిమా రూ 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో విక్రమ్ కి జోడిగా హీరోయిన్ సదా నటించింది ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ చూడడానికి చాలా చక్కగా అనిపిస్తుందని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అయితే కెమెరా ఆన్ లో లేనప్పుడు వీరిద్దరూ అన్నా చెల్లి అని పిలుచుకునే వారట..

వీరిద్దరి విషయాన్ని డైరెక్టర్ శంకర్ గమనించి తన సినిమాలో హీరో హీరోయిన్లు బయట అన్నా చెల్లెలు అన్నట్లుగా తెలిస్తే ఈ సినిమా చూసే ప్రేక్షకులు ఫీలింగ్ పోతుందని దీంతో ఈ సినిమా పైన దెబ్బ పడే పరిస్థితి ఉందని దయచేసి అలా ఉండొద్దని ఇద్దరికీ సర్ది చెప్పారట.. కానీ విక్రమ్,సదా మాత్రం పదే పదే అలానే చేస్తూ ఉంటే డైరెక్టర్ శంకర్ అసహనానికి గురై ఒకసారిగా వీరి మీద కోపం తెంచుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయని తెలుస్తోంది.. ఇదంతా గతంలో జరిగినట్టు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సదా తెలియజేసింది తాజాగా అహింస సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నది.