మురళీమోహన్ చేసిన ఆ పని వల్లే ఇండస్ట్రీకి దూరమయ్యారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు మురళీమోహన్ నిర్మాతగా, బిజినెస్ మాన్ గా ,రాజకీయ నాయకుడిగా మంచి పాపులారిటీ సంపాదించారు. హీరోగా కూడా ఏన్నో తెలుగు సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మురళీమోహన్ తన సినీ ప్రయాణాన్ని 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1973లో అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమే మాయ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత ఏడాది దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన తిరుపతి అనే చిత్రంతో మురళీమోహన్ నటుడుగా పరిచయమయ్యారు.

ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు మురళీమోహన్. మురళీమోహన్ దాదాపుగా ఇప్పటివరకు 350కు పైగా సినిమాలలో నటించారు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మురళీమోహన్ ఇటీవలే మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. తనను వెండితెరకు పరిచయం చేసిన అట్లూరి పూర్ణచంద్రరావు గారికి ,పీవీ సుబ్బారావు గార్లకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు 15 ఏళ్లు ఉంటే చాలు అనుకునేవాడిని.

A political debutant
కానీ తన నటన అందరికీ మెచ్చి 50 ఏళ్లు అయినా చలనచిత్ర పరిశ్రమలు అందరూ ఆదరించారని తెలియజేశారు.. కొన్ని పరిస్థితుల కారణాలవల్ల నేను రాజకీయాలలోకి వెళ్ళవలసి వచ్చింది. దీనివల్లే నేను చాలా దెబ్బ తిన్నాను అని తెలియజేశారు మురళీమోహన్.అందుకోసమే సినిమాలకు కాస్త దూరంగా ఉండేవాడిని ఇకనుంచి పూర్తిగా సినిమాల పైన దృష్టి సాదిస్తానని ..రాజకీయాలకు ఇక మీదట దూరంగా ఉండదలుచుకున్నారంటూ తెలిపారు మురళి మోహన్. తనకు అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పిన మాటలు ఆదర్శంగా తీసుకున్నానని తాను మరణించేవరకు సినిమాలలో నటిస్తూనే ఉంటానని తెలిపారు మురళీమోహన్. మురళీమోహన్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest