ఆమె క‌ళ్ల‌న్నీ నా మీదే.. నా లైఫ్‌లో దానికి చోటు లేదంటూ శ్రీ‌లీల షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ గా మారిన శ్రీ‌లీల గురించి పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మడు వచ్చి రెండేళ్లు కూడా కాలేదు. కానీ చేతినిండా సినిమాల‌తో స్టార్ హీరోయిన్లను సైతం గడగడలాడిస్తోంది. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్‌, నితిన్, రామ్, పవన్ కళ్యాణ్ ఇలా యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం ద‌క్కించుకుంటూ కెరీర్ ప‌రంగా య‌మా జోరు చూపిస్తోంది.

ఇదిలా ఉంటే.. మదర్స్ డే సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ‌లీల తన తల్లి గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. మా అమ్మ త‌న‌లో స‌గ‌మ‌ని, త‌న కెరీర్ కు ఎంత హెల్ప్ చేయాలో అంత చేసింద‌ని శ్రీ‌లీల చెప్పుకొచ్చింది. తాను ఈరోజు వరస సినిమాలతో ఇంత బిజీగా ఉన్నాను అంటే అందుకు ఆమె సపోర్ట్ ఎంతో ఉంద‌ని తెలిపింది.

`నా స్కూల్ డేస్ లో చాలా బిజీగా ఉండే దాన్ని. స్కూల్ అవ్వగానే డాన్స్ క్లాస్, స్విమ్మంగ్‌ ఇలా గడిచిపోయేది. నాకేమో అల్లరి చేయాలని ఉండేది. కానీ, దానికి నా లైఫ్ లో చోటు లేదు. అమ్మ కళ్ళు ఎప్పుడు నా పైనే ఉండేవి. దాంతో అల్లరి చేసేందుకు భయపడే దాన్ని. అమ్మ చాలా స్ట్రిక్ట్, అలాగే ఆమెకు ఓర్పు ఎక్కువ. నాకు ఎప్పుడు స్వేచ్ఛ ఇవ్వాలో..ఎప్పుడు ఇవ్వకూడదో ఆమెకు బాగా తెలుసు. చిన్న చిన్న విషయాలకు కూడా నేను ఎంతో భయపడతాను. కానీ అమ్మ నాకు ఎప్పుడూ అండంగా ఉంటుంది. నేను బాధ మరిచిపోయేలా కౌన్సిలింగ్ ఇస్తుంది.` అంటూ శ్రీ‌లీల త‌న త‌ల్లి గురించి ఎంతో గొప్ప‌గా చెప్పుకొచ్చింది.

Share post:

Latest