ఆ హీరో నా కోరిక తీర్చాడు.. జీవితంలో అది మ‌ర్చిపోలేనంటున్న సంయుక్త‌!

మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీన‌న్‌ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్‌ హీరోయిన్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయ‌క్‌, బింబిసార‌, సార్‌ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. రీసెంట్ గా విరూపాక్ష మూవీతో ప్రేక్షకులను పలకరించింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది.

ఈ మూవీతో సంయుక్త ఖాతాలో మరో హిట్ పడింది. దీంతో ఈ అమ్మడికి టాలీవుడ్ లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంయుక్త పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. తనకు సమంత అన్నా, ఆమె నటన అన్నా ఎంతో ఇష్టమని.. చాలామంది తన‌ను సమంతతో పోలుస్తారని, ఆమెలా తాను నటిస్తున్నాన‌ని చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుందని సంయుక్త పేర్కొంది.

అలాగే కోలీవుడ్ స్టార్ట్ ధనుష్ అంటే తనకు చాలా ఇష్టమని.. పదో తరగతి చదువుతున్నప్పుడు ధనుష్ హీరోగా నటించిన ఆడుగ‌ళం సినిమా పాటలను బస్సుల్లో చూసి డాన్స్ చేసే దాన్ని అని తెలిపింది. ఆయనతో ఒక్కసారైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలనే కోరిక ఉండేదని.. ధనుష్ ఆ కోరికను `సార్` చిత్రంతో తీర్చార‌ని.. జీవితంలో అది ఎప్పటికీ మర్చిపోలేనంటూ చెప్పుకొచ్చింది. ఇకపోతే తనకు ప్ర‌స్తుతం కుటుంబ కథా చిత్రాల్లో నటించాలని ఉందంటూ సంయుక్త పేర్కొంది.

Share post:

Latest