పుష్ప -2 చిత్రంలో పాత్ర పై క్లారిటీ ఇచ్చిన నిహారిక..!!

టాలీవుడ్లో మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా నిహారిక పాపులర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మొదట యాంకర్ గా తన కెరీర్ను మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా కూడా పలు చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో కొన్ని చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో కూడా నటించింది. నిహారిక తాను ప్రేమించిన వ్యక్తి జొన్నలగడ్డ చైతన్య ను వివాహం చేసుకుంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అందుచేతని వీరిద్దరూ విడిపోయారని వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి.

Niharika in Pushpa 2? - Telugu Rajyam

అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. దీంతో నిహారిక తాజాగా అటు నిర్మాణ సంస్థ పైన యాక్టింగ్ పైన ఫుల్ ఫోకస్ పెట్టి మళ్ళీ రీఎంట్రీ ఇస్తోంది. నిహారిక ముఖ్యపాత్రలో నటించిన వెబ్ సిరీస్ డెడ్ పిక్సెల్స్.. ఆన్లైన్ గేమ్స్ యూత్ని వాటిని ఎలా బానిసలుగా మార్చేస్తున్నాయి. వాటి వల్ల జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అనే అంశాల పైన ఈ సిరీస్ ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్, టీజర్ చూశాక ఆన్లైన్ గేమ్స్ ఆడే యువతకి ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోంది. మే 19న హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక మీడియా ముందుకు వచ్చి పుష్ప-2 లో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.దీనిపై స్పందిస్తూ ఇదంతా మీడియా సృష్టి అని నన్నయితే ఆ సినిమా నుంచి ఎవరు సంప్రదించలేదని అది చాలా మంచి సినిమా అని తెలియజేసింది. ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో అయితే నటించలేదంటూ క్లారిటీ ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

Share post:

Latest