రాముడి కోసం రూ.10లక్షలు విరాళం ఇచ్చిన ప్రభాస్..అందుకేనా..?

టాలీవుడ్లో హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న చిత్రాలన్నీ కూడా దాదాపుగా రూ .500 కోట్ల రూపాయల బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్న చిత్రాలలోని నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన అది పురుష్ చిత్రాన్ని పాన్ ఇండియా లేవలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా బిజీగా ఉన్నారు చిత్ర బృందం ఇటీవల ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా నిర్వహించడం జరిగింది.

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ప్రభాస్ తాజాగా తనలోని మరొకసారి సేవాభావాన్ని చాటుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి రూ.10 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. ఈ మేరకు ప్రభాస్ ఆత్మీయులు ఈ పది లక్షల రూపాయలు చెక్కును భద్రాచలం ఆలయ ఈఓ రమాదేవికి అందించడం జరిగింది. భద్రాచలంలోని నిత్య అన్నదానం కార్యక్రమం కోసం ప్రభాస్ ఈ విరాళం రాములోరికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇక ఎందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. దీంతో అభిమానుల సైతం ప్రశంశాల వర్షం కురిపిస్తున్నారు. జూన్ 16వ తేదీన ఆది పురుష్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మేరకు తన సినిమా విజయవంతం కావాలని సంకల్పనతో ప్రభాస్ ఈ విరాళం సమర్పిస్తున్నారని ప్రచారం కూడా జరుగుతుంది ఏది ఏమైనా రాములోరి దేవాలయంలోని భక్తుల అన్నదానం కోసం ప్రభాస్ ఈ విరాళం అందించడంతో స్టార్ హీరోలు సైతం ప్రభాస్ ను అభినందిస్తూ ఉన్నారు.

Share post:

Latest