నా జీవితం ఇలా అవుతుందనుకోలేదు.. సింగర్ సునీత హాట్ కామెంట్స్..!!

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది సింగర్స్ ఉన్నప్పటికీ సింగర్ సునీతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ఈమె పాడే పాటలు ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఎంతోమంది హీరోయిన్స్కు సైతం డబ్బింగ్ చెప్పి మరింత పాపులారిటీ సంపాదించింది సింగర్ సునీత. మొదటిసారి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గులాబీ సినిమాలో నీ ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావో అనే పాట పాడి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

Sunitha: Was tested positive for Covid-19, but now I am safe and healthy |  Entertainment News,The Indian Express

ఇక ఆ తర్వాత అవకాశాలు వెతుక్కుంటూ రావడంతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు పాటలు పాడి అతి తక్కువ సమయంలోనే స్టార్ సింగర్ గా పేరు సంపాదించింది. ఇండస్ట్రీలోకి ఎంతోమంది సింగర్స్ వచ్చినప్పటికీ సింగర్ సునీతకు ఉన్న స్థానం అలాగే కొనసాగుతోంది. బుల్లితెరపై ప్రసారమయ్యే కొన్ని షోలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తోంది ఈమె. గడిచిన కొన్ని నెలల క్రితం ప్రముఖ మ్యాంగో మీడియా అధినేత రామ్ ని వివాహం చేసుకుంది. అయితే సింగర్ సునీతకు గతంలో వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రెండో పెళ్లి చేసుకోవడంతో ఈమె పైన సోషల్ మీడియాలో పలు రకాల నెగిటివ్ కామెంట్లు కూడా వినిపించాయి.

Singer Sunitha Finally Reacts About Pregnancy Rumors

తనమీద చేసిన నెగటివ్ కామెంట్లకు ఈమె పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితం గురించి తెలియజేసింది..తన జీవితంలో ఒకప్పుడు ఎలా ఉండేదో కూడా తెలియజేసింది.. తన జీవితంలో జరిగిన కొన్ని చేదు ఘటనలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.. తెలియకుండానే ప్రతి ఒక్కరు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు.. తన మొదటి భర్తతో విడిపోయిన తర్వాత ఎన్నో కష్టాలను అనుభవించాను అదంతా పిల్లల భవిష్యత్తు కోసమే వాళ్ల భవిష్యత్తు కోసమే చాలా కష్టపడ్డాను ఈ క్రమంలోనే విడాకులు తీసుకున్న ఆ విషయాన్ని తొందరగా మర్చిపోయాను అంటూ తెలుపుతోంది. ఆ తరువాత ఒంటరిగా ఉన్న సమయంలో జీవితంలో చాలా కోల్పోయానని పించింది ఆ సమయంలోనే రామ్.. కలిశారు దాంతో స్నేహితులుగా మారాం.. మనసులు కలిసాయి.. పిల్లల అంగీకారంతోనే వివాహం చేసుకున్నామని తెలిపింది సునీత. ప్రస్తుతం అందరూ చాలా ఆనందంగా ఉన్నామని తెలుపుతోంది.

Share post:

Latest