బాలయ్య ఈ వయసులో అంత సాహసం చేస్తున్నాడా..? తేడా వస్తే దబిడి దిబిడేనా..?

టాలీవుడ్ నట సిం హం గా పేరు సంపాదించుకున్న బాలయ్య ప్రజెంట్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎన్బికె 108 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీర సింహారెడ్డి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయమందుకున్న తర్వాత బాలయ్య కామెడీ జోనర్ యాంగిల్ లో సినిమా తీస్తుండడం అభిమానులకు సైతం షాకింగ్ గా అనిపిస్తుంది . ఎప్పుడూ మాస్ ఎలిమెంట్స్ లోనే సినిమాలుఉండేలా చూసుకునే బాలయ్య ఫస్ట్ టైం ఫ్యామిలీ జోనర్ ల్లోకి వస్తు కామెడీ యాంగిల్ ని టచ్ చేస్తూ ఉండడం అభిమానులకి హ్యాపీగా అనిపిస్తుంది. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి సైతం బాలయ్య అని ఇప్పటివరకు మీరు చూడని యాంగిల్ లో చూడబోతున్నారు అని ఫ్యాన్స్ కి హింట్ ఇచ్చి ఆశలు పెంచేశారు.

 

దీంతో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోని సినిమాలో కాజల్ అగర్వాల్ – శ్రీయ హీరోయిన్లుగా నటిస్తున్నారు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు శ్రీ లీల సైతం ఈ సినిమాలో డిఫరెంట్ పాత్రలో కనిపించబోతుంది అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ క్రమంలోని అనిల్ రావిపూడి బాలయ్యతో ఐటమ్ సాంగ్లో చిందులేయడానికి ఏకంగా బాలీవుడ్ బ్యూటీ నిరంగంలోకి దించుతున్నాడు అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో యమ వైరల్ గా మారింది .

అయితే ఈ పాటలో బాలయ్య ఫుల్ మాస్ బిట్స్ కూడా వేయాలట . నిజానికి బాలయ్య వయసు 60 దాటిపోయింది. ఈ ఏజ్ లో కష్టమైన స్టెప్స్ వేయడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కానీ బాలయ్య తన అభిమానుల్ని ఎంటర్టైన్ చేయడానికి కష్టమైన స్టెప్స్ ను కూడా ప్రాక్టీస్ చేసి మరి వేస్తున్నారట. ఈ క్రమంలోనే బాలయ్య అభిమానుల కోసం పెద్ద సాహసం చేస్తున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఇప్పటివరకు మాస్ లుక్ లో చూసిన బాలయ్యను కామెడీ యాంగిల్ లో చూసి జనాలు మెచ్చితే ఓకే.. ఒకవేళ నచ్చక పోయారా కధ రివర్స్ అవ్వడం సినిమా టాక్ మారిపోవడం పక్క అంటున్నారు జనాలు, చూద్దాం మరి బాలయ్య ఏ విధంగా జనాలను మెప్పిస్తాడో..?

 

Share post:

Latest