మరో రీమేక్ చేయడానికి సిద్ధమైన చిరు.. ఈసారైనా విజయం సాధించేనా..

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఖైదీ నంబర్ 150 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన చిరు వరుస ఫ్లాప్స్‌తో బాధపడుతున్న సమయంలో ఇటీవలే రిలీజ్ అయిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం మోహన్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ‘బోళా శంకర్’ సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా బోళా శంకర్ సినిమాని చిరు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు భారీగా అంచనాలు పెంచుతున్నాయి.

బోళా శంకర్ సినిమా తరువాత కళ్యాణ్ కృష్ణ కూరసాల దర్శకత్వం వహిస్తున్న సినిమాలో చిరంజీవి నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కూడా ఒక మలయాళ రీమేక్ అని టాక్ వినిపిస్తుంది. ఈ మలయాళ సినిమాలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో, పృథ్వి రాజ్ సైడ్ రోల్‌లో నటించాడు. దర్శకత్వం కూడా వహించాడు. ఆ మూవీ ‘బ్రో డాడీ’. ఈ సినిమాకి రీమేక్‌గా చిరు అప్‌కమింగ్ మూవీ రానుంది. ఇది చాలా ఎమోషనల్, ఎంటర్టైనింగ్ గా ఉంటుందట.

అయితే తెలుగులో మాత్రం ఈ సినిమాకి కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, పృథ్వి రాజ్ పాత్రలో సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్నారని సమాచారం. ఇందులో నిజం ఉందో లేదో తెలియాలి అంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

Share post:

Latest