బిగ్ షాకింగ్: మల్టీప్లెక్సు స్క్రీన్ల‌ని అన్ని మూసేస్తున్న PVR.. ఎందుకంటే..?

దేశంలోనే మొట్టమొదట మల్టీప్లెక్స్ ఆపరేటర్ అయిన పివిఆర్ ఇప్పుడు 50 సినిమా స్క్రీన్ లను మూసివేస్తుంది . నిజమే.. మల్టీప్లెక్స్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది పివిఆర్ . ఎందుకంటే మల్టీప్లెక్స్ ఇంట్రడ్యూస్ చేసింది దేశంలో పివిఆర్ . కాగా రీసెంట్గా ఈ సంస్థ ఎవరు ఊహించిన షాకింగ్ డెసిషన్ తీసుకుంది . దేశవ్యాప్తంగా ఉన్న 50స్క్రీన్లని మూసి వేయడానికి పివిఆర్ సంచలన నిర్ణయం తీసుకుంది . దీనికి మెయిన్ రీజన్ ఆ సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోవడమే అంటూ తెలుస్తుంది.

మల్టీప్లెక్స్ స్క్రీన్ల నిర్వహణలో టాప్ గా ఉన్న పీవీఆర్ 50 స్క్రీన్లను మూసివేస్తుంది అన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జనవరి మార్చి నాలుగో త్రైమాసికంలో పివిఆర్ ఐనాక్స్ కు దాదాపు 333 కోట్లు నష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . కాగా గత ఏడాది ఇదే సమయంలోనే 100 కోట్లకు పైగా నష్టాలు పాలైన పివిఆర్ .. ఈ సంవత్సరంలో మాత్రం 333   కోట్లు నష్టం వచ్చిందట .

దీంతో థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరగడం అందుకు తగ్గట్టే ఆదాయం లేకపోవడం 50 స్క్రీన్లను మూసివేసేందుకు కారణమైంది. బాలీవుడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మారడంతో పలు సంస్థలను నష్టాలు చవిచూసింది . ఈ క్రమంలోనే ఓటీటీలు కూడా మల్టీప్లెక్స్ ల ను మూసి వేయడానికి కారణం అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలోనే నష్టాలను తప్పించుకోవడానికి పివిఆర్ సంస్థ పలుచోట్ల స్క్రీన్లను మూసివేయాలని నిర్ణయించుకుంది . కాగా స్క్రీన్ లు మూసివేసిన మల్టీప్లెక్స్ లోని మాల్స్ కొనసాగుతాయని పివిఆర్ ఐనాక్స్ తెలిపింది..!!