తరుణ్ పెళ్లి పై తల్లి షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ లో మోస్ట్ సీనియర్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోగా ఉన్నవారిలో తరుణ్ ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు.. తరుణ్ ప్రస్తుతం సినిమాలలో నటించలేదు కానీ ఆయన పెళ్లి గురించి మాత్రం తరచు అక్కడక్కడ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. మొదట చైల్డ్ యాక్టర్ గా తన సినీ కెరియర్ను మొదలుపెట్టిన తరుణ్ చిన్న వయసు నుంచే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి పేరు సంపాదించారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో సమానంగా తన సినిమాలను తెరకెక్కించారు. అయితే తన కెరీర్లు కొన్ని అనాలోచిత నిర్ణయాలు కారణం చేత తన కెరియర్ అర్ధాంతరంగా నిలిచిపోయిందని చెప్పవచ్చు.

Rumours on Tarun's wedding again!
తరుణ్ తల్లి రోజా రమణి రెగ్యులర్గా ఏదో ఒక ఇంటర్వ్యూలో కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా రోజా రమణి తన కుమారుడు కెరియర్ గురించి వ్యక్తిగత విషయాల గురించి తెలియజేసింది. తన కుమారుడు రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించింది..పెళ్లి కూడా త్వరలోనే ఉంటుందని తెలియజేయడంతో అభిమానుల సైతం తెగ ఖుషి అవుతున్నారు. రోజా రమణి మాట్లాడుతూ తరునికి దైవభక్తి చాలా ఎక్కువ అని ప్రతిరోజు గంటన్నరసేపు పూజ చేస్తారని ప్రతి ఏడాది తిరుపతికి వెళుతూ ఉంటారని మళ్ళీ కెరీర్లు నిలదొక్కుకునేందుకు తను సిద్ధంగా అవుతున్నారని తెలిపింది.

ఇక తరుణ్ పెళ్లి గురించి మాట్లాడుతూ ఆ పని ఒక్కటి అయిపోతే చాలు అన్నట్లుగా తాను ఎదురుచూస్తున్నానంటూ తెలిపింది. పెళ్లి విషయానికి స్వంతంగా తరుణ్ కి వదిలేసారని తెలియజేస్తోంది. మరి తరుణ్ పెళ్లి ఎప్పుడు అన్న విషయం హీరో తరుణ్ నే తెలియజేయాలని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు తెలియజేసింది.

Share post:

Latest