డబ్బింగ్ జానకి క్యారేజీ బాక్స్‌ను కాలుతో తన్నిన ఆ నటి.. ఎవరంటే

డబ్బింగ్‌ జానకి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. దక్షిణాదిలో సుమారు 600 లకు పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించారు జానకి. తొమ్మిదేళ్ల వయసులోనే నాటకాలు వేస్తూ అందరిని అలరించారు ఆమె. ఇక 1958లో విడుదలైన ‘భూ కైలాస్’తో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. తెలుగులో ‘గాంధీ’ అనే సినిమాలోని కస్తూరిభా పాత్రకు డబ్బింగ్‌ చెప్పి ‘డబ్బింగ్‌ జానకి’గా మారారు.

 

ముఖ్యంగా తల్లి పాత్రలు పోషిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సీరియల్స్‌లోనూ నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నటనలో 65 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన నట శిరోమణి డబ్బింగ్‌ జానకమ్మ. ఆమె తాజాగా ‘చెప్పాలని ఉంది’ అనే ఒక కార్యక్రమానికి అతిథిగా వచ్చి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఇక గతంలో జానకికి ఒక చేదు అనుభవం ఎదురయింది. ఒక నటి జానకితో దురుసుగా ప్రవర్తించింది. జానకి తనకంటే ముందుగానే తినేసిందని సదరునటి ఆగ్రహించింది. అంతేకాదు జానకి క్యారేజ్ బాక్స్ ను తన్నేసింది. ఈ సంఘటన గురించి యాంకర్ అడగక జానకమ్మ దీని గురించి పెదవి విప్పింది.

జానకి మాట్లాడుతూ తనతో అలా ప్రవర్తించిన నటి ఎవరు ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదని తెలిపింది. కానీ ఆమె తన కంటే పెద్దనటి కూడా కాదని క్లారిటీ ఇచ్చింది. ఈ ఘటన గురించి ఇంకా వివరిస్తూ.. “ఒక షూటింగ్ లో మా ఇద్దరికీ రూమ్‌ ఇచ్చారు. నాకు త్వరగా తిని నిద్రపోయే అలవాటుఉంది. అందుకని మాకు పంపిన బాక్స్‌లో కొంచెం తినేసి పడుకున్నా. కొద్దిసేపటికి ఆవిడ వచ్చి క్యారెజ్‌ ఓపెన్ చేసి చూసి బాక్స్‌ను కాలితో ఒక్క తన్ను తన్నింది. నేనేం పట్టించుకోకుండా నా పని నేను చూసుకున్నా’ అని చెప్పింది.

 

Share post:

Latest