‘ బిచ్చగాడు 2 ‘ పబ్లిక్ టాక్ సినిమా హిట్… డైరెక్టర్ ప్లాప్..!

తమిళ హీరో విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో వచ్చిన బిచ్చగాడు మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2016లో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పట్టారు. ఆ రోజుల్లోనే బిచ్చ‌గాడు తెలుగులో రు. 50 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. కోలీవుడ్‌లో కంటే తెలుగులోనే సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వ‌చ్చాయి. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2 మొదటి ప్రివ్యూ.. మళ్ళీ రికార్డులు బద్ధాలేనా |  Vijay Antony Bichagadu 2 First Review details, Bichagadu 2, Bichagadu 2  First Review, Vijay Antony, Priya Krishnaswamy ...

దాదాపు 57 సంవత్సరాల తరువాత బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్పటికే స్పెషల్ షోస్ కంప్లీట్ చేసుకున్నా ఈ సినిమాకు పాజీటివ్ టాక్ తెచ్చుకుంది. తొలి షో నుంచే సినిమా చాలా బాగుందన్న టాక్ అయితే వ‌చ్చింది. మూవీలో విజయ్ నటన అద్భుతమని అంటున్నారు. కథంతా ఒక బిజనెస్ మ్యాన్ చుట్టూ తిరుగుతుందట. అతనికి బ్రెయిన్ మార్చాల్సిన పరిస్థితి వస్తుందట.

ఆ బ్రెయిన్ మార్చిన తరువాత ఎం జరిగింది? మధ్యలో హీరో బిచ్చగాడిగా ఎందుకు మారాల్సి వచ్చింది? దానికి అతని చెల్లికి ఉన్న లీక్ ఏంటి? అనేది మిగిలిన కథ. మొదటి పార్ట్ లో మదర్ సెంటిమెంట్ మీద ఫోకస్ పెట్టిన విజయ్.. సెకండ్ పార్ట్ లో సిస్టర్ సెంటిమెంట్ ను ఫీక్స్ లో చూపించాడట. ఈ నేథ్యంలో వచ్చే సీన్స్ హృదయానికి హత్తుకునేలా ఉంటాయట.

Bichagadu 2: 'బిచ్చగాడు 2' అప్‌డేట్ ఇచ్చిన విజయ్ ఆంటోని

ఈ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ చేత కన్నీళ్లు పెట్టించడం ఖాయమనే సినిమా చూసిన వారు అంటూన్నారు. అయితే ఇంత మంచి కథనం ఉన్నా దర్శకుడు ఈ సినిమాను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించలేకపోయాడని అంటున్నారు. రియాలిటీ కి దగ్గరగా ఉన్న స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడంతో డైరెక్టర్ ఈ సినిమాను సరిగ్గా హ్యాండిల్ చేయలేదని కామెంట్లు కూడా వస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్ అందుకుంటుందో చూడాలి.

Share post:

Latest