తన తోటి నటీనటులపై షాకింగ్ కామెంట్లు చేసిన హన్సిక..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి దేశముదురు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ హన్సిక. ఈ చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటించగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ చిత్రాన్ని దర్శకత్వం వహించారు.. హన్సిక లేలేతా అందాలతో కుర్రకారులను ఈ సినిమాతో మంత్రముగ్ధుల్ని చేసింది. దీంతో హన్సిక అటు టాలీవుడ్ కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఇటీవలే వివాహం చేసుకొని ఫ్యామిలీ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తోంది హన్సిక. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది.

Trailer Talk: Hansika Speaks About Old Love Affair
ముఖ్యంగా తనతో కలిసి నటించిన పలువురు నటీనటుల గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది. తన ఫస్ట్ హీరో అల్లు అర్జున్ పైన అయితే ప్రశంసల వర్షం కురిపించింది. అల్లు అర్జున్ చాలా స్వీట్ పర్సన్ అతనితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంటుంది అంటూ ఎన్నో సందర్భాలలో తెలిపింది. హీరోయిన్ సమంత పైన హన్సిక మాట్లాడుతూ ప్రశంశల వర్షం కురిపించింది. సమంత ఒక వారియర్ సమంత చాలా స్ట్రాంగ్ పర్సన్ అని కూడా తెలిపింది..

Hansika Motwani's wedding film titled 'Love Shaadi Drama', actress talks  about husband Sohael's past in teaser

ఇక దక్షిణాది నటుల పైన ఉత్తరాది వారు కాస్త వివక్ష చూపిస్తూ ఉంటారు అంటూ తెలిపింది. నార్త్ కు చెందిన కొంతమంది డిజైనర్లు తమ దుస్తులను డిజైన్ చేయడానికి కూడా ఆసక్తి చూపించరని తెలపడం గమనార్హం.. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలకు గుర్తింపు వస్తూ ఉన్న అందరిని సమానంగా చూడడం లేదని తెలుపుతోంది అన్ని ప్రాంతీయ నటులను సమానంగా చూడడం చాలా అవసరం అంటూ కూడా తెలిపింది హన్సిక ప్రస్తుతం హన్సిక చేసిన ఈ కామెంట్లు వాయిదాలుగా మారుతున్నాయి.

Share post:

Latest