ఎన్టీఆర్ విగ్రహాన్ని నిలిపేయాలంటూ షాక్ ఇచ్చిన కోర్టు..!!

ఈనెల 28వ తేదీన ఖమ్మంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో కొంతమంది ఎన్నారైలు పారిశ్రామికవేత్తలు కలిసి సుమారుగా రూ.4 కోట్ల రూపాయలతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు జూనియర్ ఎన్టీఆర్ను ఆహ్వానించారు 54 అడుగుల ఎత్తైన ఈ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు పెద్ద ఎత్తున పలు ఏర్పాటు జరుగుతున్నాయి.

ఇదంతా బాగానే ఉన్నా శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పైన యాదవ సంఘాలు కొంతమంది అభ్యంతరాలను తెలియజేస్తున్నాయి. దీంతో మరి కొంతమంది ఆందోళనలు కూడా చేపట్టారు. పలు హిందూ సంఘాలు యాదవ సంఘాలు సైతం కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది.దీంతో కోర్టు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ పై స్టే ఇవ్వడం జరిగింది.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు విగ్రహం ఏర్పాటు చేయకూడదు అంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో విగ్రహా ఏర్పాట్లు నిలిపివేయడం జరిగింది..

మరొకవైపు కోర్టు స్టే పై హర్షం వ్యక్తం చేస్తున్న కరాటే కళ్యాణి మరొకవైపు కోర్టు ఉత్తర్వులు రావడంతో వెంటనే ఎన్నారైలు కూడా స్పందించారు.కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అంశాల పైన దృష్టి పెడుతున్నామని మార్పులు చేసి విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నామని ఎన్నారైలు తెలుపుతున్నారు.. కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎన్నో చోట్ల పెట్టారని ఎక్కడా లేని అభ్యంతరం గమ్యంలోనే ఎందుకు వచ్చింది అంటూ ప్రశ్నిస్తున్నారు.. మరి పూర్తిగా ఎన్టీఆర్ విగ్రహాన్ని మార్చుతార లేకపోతే ఎలాంటి మార్పులు చేస్తారు అన్న విషయం తెలియాల్సి ఉంది.