మరో బడా నిర్మాణ సంస్థ పై.. ఐటి దాడులు.. షాక్ లో హీరోస్..!!

ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినీ నిర్మాతల ఆఫీసుల్లో మరియు ఇళ్లల్లో ఐటీ సోదాలు సైతం నిర్వహిస్తూ ఉన్నారు. గత కొద్దిరోజుల క్రితం ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసుల పైన మరియు వారి యొక్క ఇళ్ల పైన ఐటీ దాడులు కూడా జరగడం జరిగింది. దాదాపుగా మూడు రోజులపాటు చాలా పెద్ద హడావిడి నెలకొంది. దీంతో కొంతమంది డైరెక్టర్లు హీరోలు సైతం వారి పైన దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపించాయి. ఈ సంఘటన మరువక ముందే ఇప్పుడు తాజాగా తమిళంలో తెలుగులో కూడా భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూ భారీ సినిమాలను ప్లాన్ చేస్తున్న లైకా ప్రొడక్షన్ ఆఫీసులో మరియు సంస్థ అధినేత సుభాస్కరన్ పిల్ల పైన ఈడీ అధికారులు సోదాల నిర్వహించినట్టుగా తెలుస్తోంది.

ED conducts searches at Lyca Productions in Chennai | India Business

హఠాత్తుగా ఈడి అధికారులున్ లైకా ప్రొడక్ష హౌస్ కు రావడం అంతా ఒకసారిగా ఆశ్చర్యపోయారు. సోదర మొదలైన కొద్ది సమయం తర్వాత మీడియాకు ఈ సమాచారం అందిందట .ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ పై ఇండియన్-2 , జైలర్ , అజిత్ కుమార్ తో మరొక సినిమాతో చేయబోతున్నట్లు తెలుస్తోంది.. లైకా వారి బ్యానర్లు రూపొందించిన ఈ భారీ బడ్జెట్ చిత్రాలు 1000 కోట్లకు పైగా ఉన్నట్లు తమిళ మీడియాలో వార్తలు వినిపించడం జరిగింది దీంతో వేల కోట్ల రూపాయలతో సినిమాలు నిర్మిస్తున్న ఈ లైకా ప్రొడక్షన్ హౌస్ వారు ఆర్థికపరమైన నేరాలకు పాల్పడుతున్నట్లుగా అనుమానాలు రావడంతో ఈ సోదాలు జరుగుతున్నట్టుగా సమాచారం.

మరో రెండు రోజుల రైక ప్రొడక్షన్ హౌస్ లో సోదర గురించి ఈడీ అధికారులు అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి తమిళ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు ప్రజలు రాస్తున్నారు దీంతో కొంతమంది హీరోలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నట్లు సమాచారం. మరి కొంతమందికి సినీ ప్రముఖులు సైతం షాక్ అవుతున్నట్లు సమాచారం.

Share post:

Latest