కోడ‌లు సురేఖ బుద్ధి బ‌య‌ట‌పెట్టిన చిరంజీవి త‌ల్లి.. వైర‌ల్ గా మారిన తాజా కామెంట్స్‌!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో ఆదర్శ జంటల్లో చిరంజీవి – సురేఖ లు ముందు వ‌ర‌స‌లో ఉంటారు. స్టార్ కమెడియన్, గీత ఆర్ట్స్ వ్యవస్థాపకుడు అయిన అల్లు రామలింగయ్య గారి కుమార్తె అయిన సురేఖ‌ను చిరంజీవి పెళ్లి చేసుకున్నార‌న్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత చిరంజీవి కెరీర్ మ‌రింత ఊపందుకుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిల‌దొక్కుకున్నాడు.

సురేఖ సంపూర్ణ గృహిణిగా మారింది. సుశ్మిత‌, శ్రీ‌జ‌, రామ్ చ‌ర‌ణ్‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. భ‌ర్త సినిమాల‌తో బిజీగా అవ్వ‌డం వ‌ల్ల కుటుంబ బాధ్య‌త‌ల‌ను ఇంటికి పెద్ద కోడ‌లుగా తాను తీసుకుంది. భ‌ర్తకు అన్ని విష‌యాల్లోనూ అండ‌దంగా నిలిచింది. అయితే తాజాగా కోడ‌లు బుద్ధి బ‌య‌ట‌పెడుతూ చిరంజీవి త‌ల్లి అంజనా దేవి ఆస‌క్తిక‌ర వ్యాఖ్యులు చేసింది.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గో అంజ‌నా దేవి.. చిరంజీవి భార్య సురేఖ తనకు కోడలు కాదు, కూతురు అని అన్నారు. నాకు చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే ఆసుపత్రికి తీసుకువెళుతుంద‌ని, నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుందని కోడ‌లిపై అంజ‌నా దేవి ప్ర‌శంస‌లు కురిపించారు. అలాగే చిరంజీవికి చిన్న‌త‌నం నుండి దానగుణం ఎక్కువని. తన చుట్టూ ఎవ‌రైనా ఇబ్బంది ప‌డుతుంటే త‌న‌వంతు సాయం చేసేవాడ‌ని ఆమె చెప్పుకొచ్చారు. మెగాస్టార్ కాకముందు ఎలా ఉన్నాడో, అయ్యాక కూడా అలానే ఉన్నాడ‌ని ఆమె త‌న‌యుడి గొప్పత‌నాన్ని బ‌య‌ట‌పెట్టింది.