డిజాస్టర్ అఖిల్ ‘ ఏజెంట్ ‘ ఫైన‌ల్ క‌లెక్ష‌న్స్.. ఫైన‌ల్గా ఎన్ని కోట్లు బొక్క అంటే…?

అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో అఖిల్ హీరోగా కెరీర్ ప్రారంభం నుంచి వరుస అపజయాలను అందుకుంటూ వస్తున్నాడు. అఖిల్ కెరీర్ లోనే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏజెంట్.. అఖిల్‌కు మరో భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలని ఆశ పడ్డా ఈ అక్కినేని హీరోకు మరోసారి నిరాశ మిగిల్చింది.

Akhil Akkineni's Action-packed Poster From Pan India Film Agent, Teaser On  July 15th - Akhil Akkineni, July, Mammootty, Sakshi Vaidya, Surender Reddy  | Akhil Akkineni's Action-packed Poster From Pan India Film Agent,

ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి భారీ నెగటివ్ టాక్ మొట్ట కొట్టుకుని టాలీవుడ్ లోనే అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా మిగిలింది. ఇప్పుడు ఈ సినిమా టోటల్ కలెక్షన్ ఎలా ఉన్నాయో ? ఇప్పుడు చూద్దాం. ఏజెంట్ ఫైన‌ల్‌గా థియేట‌ర్ల‌లో ప‌ది కోట్ల క‌లెక్ష‌న్లు కూడా రాబ‌ట్ట‌లేక‌పోయిపోయింది. ఓవ‌రాల్‌గా థియేట్రిక‌ల్ ర‌న్ ద్వారా ఈ సినిమాకు రూ.13.50 కోట్ల గ్రాస్, ఆరు కోట్ల ఇర‌వై ఐదు ల‌క్ష‌లకుగా షేర్ వ‌చ్చింది.

Akhil Akkineni's Agent producer Anil Sunkara reacts to film's failure, says  'we have to take the entire blame...' - India Today

ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.36 కోట్ల‌కుపైగా జ‌రిగిన‌ట్లు స‌మాచారం. దాంతో నిర్మాత‌ల‌కు ఈ సినిమా ముప్పై కోట్ల‌కుపైగా న‌ష్టాల‌ను మిగిల్చిన‌ట్లు తెలిసింది. తెలుగులో నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టాల‌ను మిగిల్చిన సినిమాల్లో ఒక‌టిగా ఏజెంట్ నిలిచింది. ఈ సినిమా మే 19న సోని లివ్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. డిజాస్ట‌ర్ టాక్ కార‌ణంగానే థియేట‌ర్‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే ఏజెంట్‌ ఓటీటీలోకి రాబోతున్న‌ది.

Share post:

Latest