తమిళంలో టాప్ హీరోగా పేరు పొందిన నటుడు విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు విశాల్ .ఇక తన ప్రతి సినిమాని కూడా తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. మరొకవైపు నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా అటు టాలీవుడ్ ప్రేక్షకులకు కోలీవుడ్ ప్రేక్షకులకు మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా ఈమె ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది.
కోలీవుడ్ మొదట్లో విశాల్ వరలక్ష్మి శరత్ కుమార్ మధ్య పలు రూమర్లు వినిపించాయి. హీరోలకు లక్కీ లేడీ గా పేరుపొందిన ఈమె వైవాహిక జీవితానికి మాత్రం ఎందుకు దూరంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి ఆలోచన అనే మాట మాత్రం దాటి వేస్తూ కనిపిస్తోంది వరలక్ష్మి శరత్ కుమార్. అందుకు గల కారణం ఏంటో అంటూ అభిమానులు ఆరా తీయగా అందుకు కారణం కోలీవుడ్ హీరో విశాల్ అన్నట్లుగా సమాచారం. విశాల్ తో చాలా కాలం పాటు ప్రేమలో ఉన్న ఈమె పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలో విశాల్ ఆమె నుంచి దూరమయ్యాడని సమాచారం..
విశాల్, వరలక్ష్మి మధ్య దూరం పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి..ఒకటి విశాల్ వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ మధ్య గొడవలు కారుణం కాక మరొకపక్క వరలక్ష్మీ శరత్ కుమార్ మొండితనం వల్లే విశాల్ వదిలేశారు అన్నట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొంతమంది ఈమెతో అవసరం తీరిపోయింది కాబట్టే వదిలేసారంటూ కామెంట్లు చేస్తున్నారు. వరలక్ష్మి తన ప్రేమను తనే చేజేతులారా నాశనం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. అయితే ఇద్దరూ ఒకరినొకరు దూరంగా ఉన్నప్పటికీ సినిమాలలో మాత్రం నటిస్తూ బిజీగా ఉన్నారు.