హీరోతో ప్రేమాయణం పై రూమర్లకు చెక్ పెట్టిన.. ఐశ్వర్య లక్ష్మి..!!

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. మొదట ఈమె గాడ్సే అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది ఆ తర్వాత ఈ సినిమా సక్సెస్ కాలేకపోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.. తమిళ్ డబ్బింగ్ గా తెరకెక్కించిన మట్టి కుస్తీ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఊహించని స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంది ఈ సినిమాతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈమె వరుసగా అవకాశాలను అందుకుంటోంది. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ -2 చిత్రంలో కూడా నటించింది.

Aishwarya Lekshmi Dating Exposed | Actress Aishwarya Lakshmi shared a  close-up picture with Arjun Das on Instagram, fans asked 'Yeh Rishta Kya  Kehlata Hai?' , (New India) - News8Plus-Realtime Updates On Breaking

ఈమె వృత్తి విద్య డాక్టర్ అయినప్పటికీ యాక్టర్ గా మక్కువ ఉండడంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నా ఇమే కేవలం సినిమాలోనే కాకుండా వ్యక్తిగత విషయాలలో కూడా తరచూ వార్తలలో నిలుస్తూనే ఉంది ఐశ్వర్య లక్ష్మి . ఈ అమ్మడు తన సహనటుడు అర్జున్ దాస్త ప్రేమలో ఉందని రూమర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. అర్జున్ దాస్ కి తనకు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది అనే వార్తలలో ఎలాంటి నిజం లేదని ఇద్దరు క్లోజ్ గా ఉన్న ఫోటోలను వీరు గతంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు దీనివల్ల ఇలా ప్రచారం జరిగిందని తెలుస్తోంది.

ఈ విషయంపై ఐశ్వర్య లక్ష్మి మాట్లాడితే కేవలం తామేత్తరం మంచి స్నేహితులమే అని అంతకుమించి మా మధ్య ఏమీ లేదంటూ స్పష్టం చేసింది.. తాను టీనేజ్ లో ఉండగానే టీం ఇండియన్ క్రికెట్ ప్లేయర్ యువరాజ్ సింగ్ తో ప్రేమలో పడ్డాను అని తెలిపింది. యువరాజ్ సింగ్ అంటే చాలా ఇష్టమని తన మనసులో ప్రేమను చెప్పుకొచ్చింది. తనకు విలన్ రోల్స్ అంటే ఇష్టం ఉండదని అలాంటి పాత్రలో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

Share post:

Latest