పొత్తులతోనే ముందుకు..సీఎం అభ్యర్ధి అప్పుడే ఫిక్స్.!

మొత్తానికి ఏపీ రాజకీయాల్లో పొత్తులు ఫిక్స్ అవుతున్నాయి. వైసీపీని గద్దె దించేందుకు పొత్తులతోనే ముందుకెళ్తామని పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి..ఇలా మూడు పార్టీలు పొత్తులోనే వెళ్తామని అంటున్నారు. అయితే ఎవరు కలిసొస్తారో లేదో తనకు తెలియదని, ఇప్పటివరకు జరిగిన చర్చలు ప్రకారం..మూడు పార్టీలు పొత్తులో ఉంటాయని, అలాగే ఎన్నికల తర్వాతే సీఎం సీటు గురించి చర్చ ఉంటుందని పవన్ చెప్పుకొచ్చారు.

తమ ప్రత్యర్థి వైసీపీయేనని.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం.. పొత్తుల ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడమే లక్ష్యమని,  త్రిముఖ పోటీలో మరోసారి బలికావడానికి సిద్ధంగా లేనన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు.. సీఎం ఎవరు కావాలనేది ఆ రోజు పరిస్థితులు, బలాబలాలను బట్టి నిర్ణయిస్తామన్నారు. పొత్తులపై ఇంకా చర్చలు జరగలేదన్నారు. కానీ తాను సిద్ధమనే ప్రకటించానని చెప్పారు. అంటే మూడు పార్టీల మధ్య పొత్తు ఉండాలనేది పవన్ ఆకాంక్ష. కానీ బి‌జే‌పి ఏమో..టి‌డి‌పితో పొత్తుకు రెడీగా లేదు. టి‌డి‌పితో పొత్తు పెట్టుకుని ఇప్పటికే పలుమార్లు నష్టపోయామని, మరోసారి నష్టపోవడానికి తాము సిద్ధంగా లేమని బి‌జే‌పి అంటుంది.

ఇటు టి‌డి‌పి శ్రేణులు సైతం బి‌జే‌పితో పొత్తు వద్దు అనుకుంటున్నారు. కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉండటంతో కాస్త మద్ధతు ఉంటుందనే భావనలో చంద్రబాబు ఉన్నారు. ఇక బాబు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలని తమ్ముళ్ళు చూస్తున్నారు. కానీ రాష్ట్రానికి పెద్దగా ఏం చేయని బి‌జే‌పిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అలాంటప్పుడు బి‌జే‌పితో పొత్తు వద్దనే భావన టి‌డి‌పి శ్రేణుల్లో ఉంది.

ఇక జనసేన ఏమో ఇప్పుడు బి‌జే‌పితో పొత్తులో ఉంది. ఇలా పొత్తుల విషయంలో పవన్ రెడీగానే ఉన్న..అటు టి‌డి‌పి, బి‌జే‌పి వైఖరి ఏంటి అనేది క్లారిటీ లేదు. తర్వాత సి‌ఎం సీటు కూడా గురించి చర్చ అంటున్నారు. అసలు చంద్రబాబుని దాటి సి‌ఎం పదవి ఎటు వెళ్లదని టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి.

Share post:

Latest