రోజుకు గంట‌న్న‌ర అదే ప‌ని.. పెళ్లికి మాత్రం నో అంటున్న త‌రుణ్‌!

చైల్ట్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ త‌ర్వాత స్టార్ హీరోగా ఎదిగిన త‌రుణ్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ల‌వ‌ర్ బాయ్ గా త‌క్కువ స‌మ‌యంలో యూత్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఎంత త్వ‌ర‌గా ఎదిగాడో.. అంతే త్వ‌ర‌గా ఫేడౌట్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. వ‌రుస ఫ్లాపులు, కొత్త హీరోలు వచ్చేయడం.. పోటీ పెరిగిపోవడంతో తరుణ్ సైలెంట్‌గా సైడ్ ఇచ్చాడు.

అయితే త‌రుణ్ ఇటు సినిమాలే కాదు.. అటు పెళ్లి కూడా చేసుకోవ‌డం లేదు. వ‌య‌సు 40కి చేరువైనా త‌రుణ్ మాత్రం నో పెళ్లి అంటున్నాడు. గ‌తంలో ఈయ‌న‌కు పెళ్లికి సంబంధించి అనేక వార్త‌లు వైర‌ల్ అయినా.. అవి పుకార్లుగానే మిగిలాయి. తాజాగా తాజాగా త‌రుణ్ పై ఆయ‌న త‌ల్లి, అలనాటి హీరోయిన్ రోజా రమణి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో రోజా ర‌మ‌ణి మాట్లాడుతూ.. `నా కొడుకు త‌రుణ్ పెళ్లిపై ఎన్నో రూమ‌ర్స్ వ‌చ్చాయి. అవి చూస్తే బాధ క‌లుగుతుంటుంది. తరుణ్ పెళ్లి కోసమే మేము ఎదురు చూస్తున్నాము. అది ఒక్కటి అయితే చాలు. అంతకు మించింది మాకు ఏది లేదు. అది ఎలాగో అవుతుంది. తరుణ్ రోజూ గంటన్నర పాటు పూజలు చేస్తాడు. ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తాడు. నా కంటే భక్తి ఎక్కువ. శని, మంగళవారం నాన్ వెజ్ తినడు. అలాగే త్వ‌ర‌లోనే త‌రుణ్ రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఒక వెబ్ సిరీస్ పాటు సినిమాకు క‌మిట్ అయ్యాడు` అంటూ ఆమె చెప్పుకొచ్చారు. దీంతో రోజా ర‌మ‌ణి కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest