సమంత సినిమాలు వరుసగా ఫ్లాప్.. భారీ డిజాస్టర్‌గా యశోద?*

ఏ మాయ చేశావే సినిమాతో ప్రేక్షకుల హృదయాలను సమంత కొల్లగొట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో స్టార్ హీరోల సరసన వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంది. ఇక నాగచైతన్యతో ప్రేమ వివాహం, కొన్నాళ్లకే విడాకులు వంటి పరిణామాలు ఆమె జీవితాన్ని కుదిపేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. పంటి బిగువున నొప్పి భరిస్తూనే వరుస సినిమాలు చేస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు గతంలో మంచి వసూళ్లనే దక్కించుకున్నాయి. అయితే కొన్నాళ్లుగా ఆమె నటించిన సినిమాలు వరుస పరాజయాలను మూటగట్టుకుంటున్నాయి. తాజాగా హైప్ క్రియేట్ చేసిన శాకుంతలం సినిమా డిజాస్టర్ గా మారిందనే అభిప్రాయాలు వస్తున్నాయి.

‘శాకుంతలం’ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. ఈ పాన్-ఇండియా సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైందనే భావన వ్యక్తం అవుతోంది. విడుదలకు ముందు ఈ సినిమాకు చాలా హైప్ వచ్చింది. కానీ విమర్శకులను, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. దీనికి మిక్స్‌డ్ టాక్ వస్తోంది. శాకుంతలం సినిమా ఏప్రిల్ 15, 2023న భారతదేశం అంతటా థియేటర్‌లలో విడుదలైంది. ఈ చిత్రం సంస్కృత కవి కాళిదాసు రచించిన అభిజ్ఞానశాకుంతలం నాటకం ఆధారంగా రూపొందింది. నటుడు దేవ్ మోహన్ హీరోగా నటించాడు. రాజు దుష్యంత్‌ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు.


ఋషి విశ్వామిత్ర-అప్సరస మేనక కుమార్తె అయిన శకుంతల పాత్రను సమంత పోషించింది. ఈ చిత్రంలో మోహన్ బాబు, మధు, గౌతమి, జిషు సేన్‌గుప్తా, అదితి బాలన్, అనన్య నాగళ్ల కూడా నటించారు. గుణశేఖర్ రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాపై కొందరు మిక్స్‌డ్ టాక్ ఉన్నప్పటికీ ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం ప్రశంసిస్తున్నారు. మంచి ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు. ఈ సినిమాపై కొందరు సినీ ప్రముఖులు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. అయితే సమంత నటిస్తున్న సినిమాలు వరుస ప్లాఫ్‌లు కావడంతో ఆమె అభిమానులు ఒకింత ఆందోళనలో ఉన్నారు.