హాట్ టాపిక్ గా రష్మిక రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కో సినిమాకు అంత డిమాండ్ చేస్తుందా?

`పుష్ప‌`తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా.. ప్ర‌స్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు చేస్తూ స‌త్తా చాటుతోంది. వార‌సుడు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తో ఈ ఏడాదిని ఘ‌నంగా ప్రారంభించిన ర‌ష్మిక‌.. తెలుగులో అల్లు అర్జున్ కు జోడీగా `పుష్ప 2`లో న‌టిస్తోంది.

అలాగే బాలీవుడ్ లో ర‌ణబీర్ క‌పూర్ స‌ర‌స‌న `యానిమ‌ల్‌` అనే సినిమాకు క‌మిట్ అయింది. `అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా రెయిన్‌బో` అనే ఓ ఫిమేల్ సెంట్రిక్ మూవీకి సైన్ చేసింది. ఇందులో మ‌లయాళ న‌టుడు దేవ్ మోహ‌న్ హీరోగా న‌టిస్తుంటే.. శాంతరూబన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. ర‌ష్మిక చేతిలో ఉన్న ఈ మూడు ప్రాజెక్ట్ లు పాన్ ఇండియా చిత్రాలే కావ‌డం విశేషం.

అయితే క్రేజ్ ఉండ‌గానే క్యాష్ చేసుకోవాల‌న్న ఫార్ములాను హీరోయిన్లు గా బాగా ఫాలో అవుతుంటారు. ఇదే రూట్ లో ర‌ష్మిక కూడా వెళ్తోంది. ఆల్రెడీ ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేస్తున్న ర‌ష్మిక‌.. ఇప్పుడు ఏకంగా రూ. 6 కోట్లు డిమాండ్ చేస్తుంద‌ట‌. ప్ర‌స్తుతం ఈ విష‌యంలో ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ బ్యూటీ సైన్ చేసిన రెయిన్‌బో చిత్రానికి కూడా అదే రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటుంద‌ని ఇన్‌సైడ్ టాక్ న‌డుస్తోంది. ఇదే నిజ‌మైతే సౌత్ లో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాలో ర‌ష్మిక ముందు ఉంటుంద‌ని అంటున్నారు.