`ఏజెంట్‌` ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. సినిమాకు అవే పెద్ద మైన‌స్‌లు!

అఖిల్ అక్కినేని హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ `ఏజెంట్‌`. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టిస్తే.. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించారు.

భారీ బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ సినిమా రేపు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా ఏజెంట్ ఫ‌స్ట్ రివ్యూ బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాలీవుడ్ ఫిల్మ్ క్రిక‌ట్‌, ఓవర్సీస్‌ సెన్సార్ బోర్డు స‌భ్యుడు ఉమైర్ సంధు ఏదైనా పెద్ద సినిమా విడుద‌ల అవుతుంది అంటే.. రిలీజ్ కు ముందే రివ్యూ ఇచ్చేస్తుంటారు.

తాజాగా ఏజెంట్ మూవీకి రివ్యూ ఇచ్చాడు. ‘ఏజెంట్’ సినిమా సోల్ లేని బ్యూటిఫుల్ బాడీ అంటూ ఉమైర్ సంధు పేర్కొన్నాడు. యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉన్నాయని, మ‌మ్ముట్టి త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేశాడ‌ని కానీ.. స్టోరీ, స్క్రీన్ ప్లే బాలేదని, సినిమాకు అవే పెద్ద మైన‌స్ లు అంటూ వెల్ల‌డించాడు. అంతేకాదు, అఖిల్ యాక్టివ్ క్లాసుల‌కు వెళ్లాలంటూ విమ‌ర్శ‌లు చేశాడు. ఫైన‌ల్ గా సినిమాకు 2/5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. మ‌రి రేపు విడుదల కాబోయే ఏజెంట్ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు అల‌రిస్తుందో చూడాలి.