వై నాట్ పులివెందుల..రివర్స్ స్కెచ్..!

ఏపీలో ప్రతిపక్ష టి‌డి‌పి దూకుడు పెంచింది. వరుసగా మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించడంతో మంచి ఊపు మీద ఉంది..ఇంతకాలం విజయాలకు దూరమైన టీడీపీకి..ఈ విజయాలు కొత్త ఊపుని తీసుకొచ్చాయనే చెప్పాలి. ఇదే ఊపుతో టీడీపీ నెక్స్ట్ ఎన్నికల్లో కూడా గెలిచి అధికారంలోకి రావాలని చూస్తుంది. అయితే వైసీపీ ఏమో 175 కి 175 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్న విషయం తెలిసిందే.

అయితే ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కాదు కదా..కనీసం మ్యాజిక్ ఫిగర్ సీట్లు గెలిచి వైసీపీ అధికారంలోకి రాలేదని, ఇక వై నాట్ 175, వై నాట్ కుప్పం అని జగన్ అంటున్నారని..కుప్పంలో కాదు..ముందు జగన్ సొంత స్థానం పులివెందులలో గెలుస్తారో లేదో చూడాలి టి‌డి‌పి సవాళ్ళు విసురుతుంది. వై నాట్ పులివెందుల అనేది తమ టార్గెట్ అని అంటున్నారు. వైసీపీకి రివర్స్ లో టి‌డి‌పి టార్గెట్ ఫిక్స్ చేసింది. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయంతో టీడీపీ దూకుడుగా రాయలసీమలో కూడా సత్తా చాటడం ఖాయమని భావిస్తుంది.

ఎమ్మెల్సీ పోలింగ్ లో పులివెందుల లో సైతం టీడీపీకి మెజారిటీ వచ్చిందని అటు కుప్పంలో ఎలాగో టి‌డి‌పిదే మెజారిటీ అని, కాబట్టి వై నాట్ పులివెందుల కాన్సెప్ట్ తో వెళుతున్నట్లు టి‌డి‌పి నేతలు చెబుతున్నారు. అయితే ఈ విజయాలని చూసుకుని టి‌డి‌పి ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళితే దెబ్బతినక తప్పదు.

ఎన్నికల్లో గెలిచేశాం అని చెప్పి నేతలు రిలాక్స్ అయితే అసలు ఎన్నికల్లో దెబ్బతింటారు. ఇంకా నేతలు దూకుడుగా పనిచేస్తేనే టి‌డి‌పి గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.