మిగతా హీరోలల్లో లేనిది.. ఎన్టీఆర్ లో ఉన్నది అదేనా..? ..అందుకే ఇలా గ్లోబల్ స్టార్ అయ్యారా..?

ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో.. అమెరికాలో ఎక్కడ చూసినా ఒకటే పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది . అదే ఆర్ ఆర్ ఆర్ ..రణం రౌద్ర రుధిరం అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని డైరెక్ట్ చేశాడు . రీసెంట్ గా నే ఈ సినిమా ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. ఈ క్రమంలోనే అమెరికాలో ఆర్ఆర్ఆర్ టీం సినిమా ప్రమోషన్స్ జెట్ స్పీడ్ లో ముందుకు తీసుకెళ్లారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో హంగామా చేస్తున్నారు .

రీసెంట్ గానే ఎన్టీఆర్ సైతం అమెరికా చేరుకున్నారు . కాగా నందమూరి తారకరత్న మరణం కారణంగా కొన్ని కార్యక్రమాలకు హాజరు అవ్వాల్సిన కారణంగా ఇక్కడే ఉండిపోయిన తారక్.. రీసెంట్ గానే అమెరికా చేరుకున్నారు . అమెరికా చేరి చేరుకోవడంతోనే ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు . అంతేకాదు రీసెంట్గా అభిమానులతో ముచ్చటించిన ఎన్టీఆర్ ..”మీరు లేకుంటే నేను లేను” అంటూ చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిన కామెంట్స్ చేసారు. అంతేకాదు..” మరో జన్మంటూ ఉంటే మీ కోసం ఇలాగే పుట్టాలని ఉంది” అంటూ చాలా స్ట్రాంగ్ గా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఎన్టీఆర్ పేరు మరోసారి వైరల్ అవుతుంది. టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు ఉన్నారు . సీనియర్ హీరోలు ఉన్నారు.. ప్రజాసేవ చేసే నాయకులు ఉన్నారు.. మంచి మాటలు మాట్లాడే హీరోస్ ఉన్నారు.. కానీ ఎందుకు జనాలు ఎన్టీఆర్ ని ఎక్కువ అభిమానిస్తారు ..ఆరాధిస్తారు అంటే దానికి కారణం ఎన్టీఆర్ అభిమానులతో మొక్కుబడిగా కాదు.. ప్రేమతో మాట్లాడుతారు . వాళ్ళు అడిగితే ఎలాంటి సహాయమైనా చేస్తారు .. అడగకపోయినా వాళ్ళను తన తమ్ముడిలా భావించి బాగోగులు చూసుకుంటారు . ఆ కారణంగానే ఎన్టీఆర్ కి ఇంతటి మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు.

అప్పట్లో నందమూరి తారకరామారావు గారు ఎలాగో ఇప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ అలాగే అందుకే గ్లోబల్ స్టార్ అయ్యారు. అంటూ జై ఎన్టీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు . ఏ మాటక ఆ మాటే ఎన్టీఆర్ మాట్లాడుతూ ఉంటే ఎలాంటి వారైనా సరే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది.. కన్ను అర్పకుండా ఎంతసేపైనా వినాలి అని అనిపిస్తూనే ఉంటుంది అంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

 

Share post:

Latest