ఆస్కార్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా.. అనూహ్య మార్పు చేసిన అకాడమీ..!!

ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఆస్కార్ అవార్డు వేడుకలకు అంతా సిద్ధమయింది . మరి కొద్ది గంటల్లోనే లాస్ ఏంజెల్ నగరం లో ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవానికి సిద్ధం కానుంది . ఈ క్రమంలోనే ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డులలో భారీ మార్పులు చేశారు నిర్వాహకులు . మార్పు చిన్నదే అయినా కానీ అది ఎంతో ప్రత్యేకంగా కాబోతుంది అంటూ సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు . మనకు తెలిసిందే ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా అవార్డుల వేడుక జరిగిన ముఖ్యంగా అందరూ గమనించేది రెడ్ కార్పెట్. అలాంటి రెడ్ కార్పెట్ పై నడవాలని ఎంతోమంది హీరోలు హీరోయిన్లు ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు .

అది వాళ్ళకి దక్కే గౌరవంగా భావిస్తారు. కనీసం రెడ్ కార్పెట్ పై ఒక్కసారైనా నడిస్తే చాలు అని అనుకునే మన తెలుగు ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్ లు బోలెడు మంది ఉన్నారు. కానీ ఆ అవకాశం అందరికీ వరించదు మరీ ముఖ్యంగా అస్కార్ రెడ్ కార్పెట్ పై నడవడం అంటే అది ఎంతో లక్ ఉండాలనే చెప్పాలి . ఇప్పటివరకు మన ఇండియన్స్ రెడ్ కార్ పెట్ పై నడిచిన సందర్భాలు లేవు . ఫస్ట్ టైం ఆర్ ఆర్ ఆర్ టీం సభ్యులు ఆస్కార్ కార్పెట్ పైన నడవబోతున్నారు.

ఆస్కార్ ఆచారం ప్రకారం కార్ పెట్ రంగు రెడ్ కలర్ లో ఉండాలి . 1961 నుంచి ఈ ట్రెండ్ వచ్చింది. 33వ అకాడమీ అవార్డుల వేడుక నుంచి రెడ్ కార్ పెట్ పై సినిమా తారలు నడవడం స్టార్ట్ చేశారు . దీంతో కార్ పెట్ ఈ అవార్డులో ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది . కాగా ఇది మన తెలుగు వాళ్లకి మరింత ప్రత్యేకం కానుంది . మన దేశం నుంచి ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటతో ఆస్కార్ కి పోటీపడబో.తుంది ఇప్పటికే ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకుంది . మరికొద్ది గంటల్లోనే ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డును ముద్దాడబోతుంది అంటూ తెలుగు జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!

Share post:

Latest