సిట్టింగులకు సీట్లు..ఆ దమ్ము ఉందా? టీడీపీ రివర్స్!

దమ్ముంటే 175 స్థానాల్లో టి‌డి‌పి, జనసేనలు ఒంటరిగా పోటీ చేయాలి..అసలు అలా పోటీ చేసే సత్తా ఆ రెండు పార్టీలకు ఉందా? అని జగన్ పదే పదే సవాళ్ళు విసురుతున్న విషయం తెలిసిందే. అలా సవాల్ విసరడం వల్ల ఆ రెండు పార్టీలు రెచ్చిపోయి విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి తమకు లబ్ది జరుగుతుందనేది జగన్ కాన్సెప్ట్ అందుకే పదే పదే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. గత ఎన్నికల్లో టి‌డి‌పి, జనసేన వేరు వేరుగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం చేకూరింది.

ఒకవేళ వైసీపీ గెలిచేది ఏమో గాని అన్నీ సీట్లు మాత్రం వచ్చేవి కాదు..రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే వైసీపీకి నష్టం జరిగేది. కానీ ఈ సారి ఆ పరిస్తితి రాకూడదు అని చంద్రబాబు, పవన్ ముందుకెళుతున్నారు. పొత్తు దిశగా పనిచేస్తున్నారు. దాదాపు పొత్తు ఫిక్స్ అనే చెప్పాలి. ఈ పొత్తుతో వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. కానీ ఈ పొత్తుని ఏదొక విధంగా దెబ్బకొట్టాలనేది వైసీపీ ప్లాన్. అసలు ఆ రెండు పార్టీల మధ్య  పొత్తు లేకపోతే తమకు లాభం జరుగుతుందని చూస్తున్నారు. అందుకే దమ్ముంటే 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని జగన్ సవాల్ విసురుతున్నారు.

అయితే జగన్ చెప్పింది తాము ఎందుకు చేయాలని తమ వ్యూహాలు తమకు ఉన్నాయని టి‌డి‌పి, జనసేన నేతలు అంటున్నారు. పొత్తు పెట్టుకుంటామో లేదో వైసీపీకి ఎందుకని అంటున్నారు. ఇదే క్రమంలో జగన్ కు దమ్ముంటే ఇప్పుడున్న అందరూ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తారా? అని సవాల్ చేస్తున్నారు. దమ్ముంటే సిట్టింగులు అందరికీ సీట్లు ఇవ్వాలని సవాల్ విసురుతున్నారు. ఎందుకంటే అందరికీ జగన్ సీటు ఇవ్వలేని పరిస్తితి. ఇస్తే వైసీపీకే దెబ్బ. మొత్తానికి టి‌డి‌పి రివర్స్ ఎటాక్ మొదలుపెట్టింది.

Share post:

Latest