ఫుల్ రొమాంటిక్ మూడ్ లో బన్నీ.. ఈరోజు అంత జిల్ జిల్ జిగా.. రీజన్ అలాంటిదే మరి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ తో నాన్న అల్లు అరవింద్ ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి తోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న బన్నీ ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ హీరోగా రాజ్యమేలేస్తున్నాడు .

 

సినిమా ఇండస్ట్రీలో ఎంత స్టార్ పొజిషన్లో ఉన్నాడో ఫ్యామిలీ పరంగాను అలాంటి ఓ మంచి స్థానాన్ని అందుకున్నాడు అల్లు అర్జున్ . బన్నీ ఎప్పుడు టాక్ పోసిషన్ లోనే ఉంటాడు. కాగా ఈరోజు అల్లు అర్జున్ – స్నేహారెడ్డి ల పెళ్లిరోజు. 2011 మార్చి 6న అల్లు అర్జున్ స్నేహ రెడ్డిలు వేదమంత్రాలు సాక్షిగా ఏడడుగులు వేశారు. ఈ క్రమంలోనే వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా భార్య స్నేహ రెడ్డికి స్పెషల్ విషెస్ అందించారు అల్లు అర్జున్ .

భార్యతో ఉన్న రొమాంటిక్ ఫోటోను షేర్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో ఆమెకు విషెస్ అందించారు. ఈ క్రమంలోనే బన్నీ ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ కు వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు .కాగా మనకు తెలిసిందే స్నేహ రెడ్డి – అల్లు అర్జున్ లది ప్రేమ వివాహం. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఏర్పడిన పరిచయం.. కాస్త ప్రేమగా మారి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని ప్రజెంట్ కొడుకు – కూతురుతో లైఫ్ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళ కూతురు అల్లు అర్హ అప్పుడే సినీ ఇండస్ట్రీలోకి కూడా వచ్చేసింది. సమంత హీరోయిన్గా నటించిన శాకుంతలం సినిమాలో అల్లు అర్హ బాల భరతుడి పాత్రలో కనిపించబోతుంది..!!

Share post:

Latest