ఎమ్మెల్సీ పోరు..అసెంబ్లీలో ట్విస్ట్‌లు ఉంటాయా?

ఇటీవలే స్థానిక సంస్థల కోటా, టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల కోటాలో 8 స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. ఇక ప్రైవేట్ టీచర్లకు కూడా ఓటు హక్కు కపించి బొటాబోటి మెజారిటీతో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలని వైసీపీ గెలుచుకుంది. కానీ అసలైన పట్టభద్రుల స్థానాల్లో గెలవడంలో మాత్రం వైసీపీ విఫలమైంది. మూడు స్థానాల్లో టి‌డి‌పి గెలిచింది.

ఇక ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సంఖ్యా బలంగా చూస్తే మొత్తం 7 స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి..కానీ ఇక్కడ కొన్ని ట్విస్ట్‌లు ఉన్నాయి. అసలు ఎన్నికల ప్రక్రియలో ఏం జరుగుతుంది..ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయనేది ఒక్కసారి చూసుకుంటే..వైసీపీ నుంచి 7 గురిని బరిలో దింపారు. ఇటు టి‌డి‌పి నుంచి ఒక అభ్యర్ధి బరిలో ఉన్నారు. దీంతో వైసీపీకి 6 స్థానాలు గెలవడం సులువే. కానీ 7వ స్థానం గెలవడం మాత్రం కష్టమయ్యేలా ఉంది.

ఒక్కో ఎమ్మెల్సీ స్థానం గెలవాలంటే 22 ఎమ్మెల్యేలు కావాలి..7 స్థానాలు గెలవాలంటే 154 కావాలి..అయితే వైసీపీకి 151 మంది ఉన్నారు..ఇటు టి‌డి‌పి నుంచి 4గురు, జనసేన నుంచి ఒకరు వైసీపీలోకి జంప్ చేశారు. దీంతో వైసీపీ బలం 156కు చేరుకుంటుంది. ఈ సంఖ్యతో 7 స్థానాలు వైసీపీ గెలుచుకోవచ్చు. కానీ టి‌డి‌పి విప్ జారీ చేసింది..విప్ ధిక్కరిస్తే తిప్పలు తప్పవు.

అదే సమయంలో వైసీపీలో ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారు..వారు టి‌డి‌పి వైపుకు వస్తే సీన్ మారుతుంది. 4 గురు వైసీపీ వైపుకు వెళితే టి‌డి‌పికి 19 మంది ఉంటారు. వైసీపీ రెబల్స్ టి‌డి‌పి వైపు ఉంటే 21 అవుతారు. ఇంకో ఎమ్మెల్యే వస్తే టి‌డి‌పిదే గెలుపు మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి.