కమిట్మెంట్ తో సినిమాలలో నటించను నివేదా పేతురాజు..!!

సినిమాలంటే ఫ్యాషన్తో కొంతమంది ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు.మరి కొంతమంది స్టార్ హీరోయిన్గా ఎదగాలని చాలా కమిట్మెంట్తో ఈ రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు. కానీ హీరోయిన్ నివేదా పేతురాజ్ విషయంలో మాత్రం అంత భిన్నంగానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. హీరోయిన్గా ఆమెకు మంచి అవకాశాలే వస్తున్న స్టార్ హీరోలకు జోడిగా నటించలేకపోతోంది.కేవలం కొంతమంది హీరోలతోనే సినిమాలలో నటిస్తోంది. ఈ అమ్మడు వర్షన్ ఏంటో ఇప్పటికీ అభిమానులకు అంత చిక్కడం లేదు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

Nivetha Pethuraj: I'm Happy That Audiences Are Comparing Tik Tik Tik To  Hollywood Filmsనివేద పేతురాజు మాట్లాడుతూ.. సమంత, నయనతార, అనుష్క తరహాలో తాను కమిట్మెంట్తో ఇండస్ట్రీలో పనిచేయడం లేదట.వారు సినిమా కోసం జీవితాన్ని త్యాగం చేశారు..కానీ తాను అలా కాదని నటనతో పాటు వ్యాపారాలు కూడా తానే చూసుకుంటున్నానని తెలియజేసింది.ఈ క్రమంలో యాక్టింగ్ పైన పెద్దగా శ్రమ పెట్టలేదని తెలియజేస్తోంది. అలాగే తన టాలెంట్ కు తగ్గ అవకాశాలు కూడా రాలేదని స్టార్డం కూడా రాలేదని తెలిసిన వాళ్ళు చెబుతూ ఉంటారని తెలుపుతోంది. కోవిడ్ సమయంలో నిర్మాతల కష్టాలు అర్థం అయ్యాయి అలాగే నిర్మాణ రంగంలో రావాలని తనకున్న మా అమ్మ మాటకు కట్టుబడి నిర్మాతగా మారనని తెలుపుతోంది. ఆస్థానంలో దర్శకురాలిగా మారుతుందట. అయితే తాను జాతకం చూసి సినిమాలు నిర్మిస్తే నష్టపోతానని చెప్పిందట.

Flashback Friday! Nivetha Pethuraj steams up the cyberspace with her  irresistible PHOTOS | The Times of India
కానీ జాతకాలు ఆమె పట్టించుకోదట. ఈ విషయంలో అమ్మ మాటని జవదాటడం ఇష్టం లేక అలాగే ఉన్నానని తెలుపుతోంది. నటనపరంగా సాయి పల్లవి అంటే ఇష్టమని ఆమె చేసిన పాత్రలు చేయాలని ఉంది అంటూ తెలియజేస్తోంది నివేదా పేతురాజ్. సెకండ్ లీడ్ చాన్సులు వస్తే నటించవద్దని చాలామంది స్నేహితులు తనతో చెప్పారట. కానీ మహేష్ తో అలాంటి ఛాన్స్ వస్తే మిస్ చేసుకోను అంటుంది ఈ ముద్దుగుమ్మ.

Share post:

Latest