గత కొంత కాలం నుంచి చిత్ర పరిశ్రమలో నటినటుల విడాకులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హట్ టాపిక్ అవుతు వస్తున్నాయి. ఇప్పుడు మెగా కుటుంబం నుంచి మరో జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గటీ సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పుడు దీంతో మెగా కుటుంబంలో పెళ్లిలు కలిసి రావడం లేదానే కామెంట్లు కూడా వస్తున్నాయి. మెగా కుటుంబానికి చెందిన పవన్ కళ్యాణ్ వేర్వేరు కారణాల వల్ల మొదటి భార్య, రెండో భార్యకు విడాకులు ఇచ్చారు.
అంతేకాకుండా చిరు పెద్ద కూతురు సుస్మిత, ఉదయ్ కిరణ్‌ను పెళ్లి కొన్ని కారణల వల్ల మధ్యలోనే అగిపోయింది. చిరు చిన్న కూతురు శ్రీజ వ్యక్తిగత జీవతం కూడా ఎన్నో వివాదాల్లో ఇరుక్కుంది. ఆమె కూడా మూడు పెళ్లిలు చేసుకున్ని మూడో భర్తకు కూడా విడకులు ఇవ్యడానికి రేడిగా ఉంది. మెగా బ్రదర్ నాగబాబు చిన్న కూతురు నిహారిక గురించి కూడా ఇప్పుడు ఇదే తరహా వార్తలు ప్రచారంలోకి రావడం గమనార్హం. మరోవైపు అక్కినేని కుటుంబంలో కూడా ఇవే తరహా ఘటనలు జరుగుతు వస్తున్నాయి.
నాగార్జున మొదటి వివాహం లక్ష్మీతో జరగగా మొదటి భార్యతో నాగ్ కూడా విడాకులు తీసుకున్నారు. తండ్రి బాటలో నాగచైతన్య- సమంత కూడా విడాకులు తీసుకున్నరు. నాగ్ చిన్న కోడుకు అఖిల్ వివాహానికి సంబంధించి కూడా నిశ్చితార్థం తర్వాత కోన్ని అనుకోన్ని కారణల వల్ల మధ్యలోనే అగిపోయింది. అదే విధంగా సుమంత్ కూడా తన భార్యతో విడిపోయారనే విషయం తెలిసిందే. మెగా, అక్కినేని కుటుంబాలకే ఈ విధంగా ఎందుకు జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు.
మెగా, అక్కినేని కుటుంబాలకు టాలీవుడ్‌లో ఎంతో పేరు ఉండగా ఇప్పుడు ఈ తరహా ఘటనల వల్ల వారి పరువు పోతుందని కామెంట్లు కూడా వస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న జోడీలు సైతం కూడా విడిపోతూ ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నిహారిక విషయంలో వైరల్ అవుతున్న ఈ వార్తల గురించి మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాల్సి ఉంది.