“కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు”.. మనోజ్ మాటలకు అర్ధాలే వేరులే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మంచు మనోజ్ పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనందరికీ బాగా తెలిసిందే . కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు రాజకీయాల్లోనూ మంచు మనోజ్ పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాడని.. ఆ కారణంగానే మంచు మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు అన్న న్యూస్ ఇప్పుడు సినీ రాజకీయాలలో కొత్త డౌట్లు పుట్టిస్తుంది .


శుక్రవారం రాత్రి తన అక్క మంచు లక్ష్మి ఇంట్లో గ్రాండ్ గా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ ..ఆ తర్వాత అత్తగారింటికి వెళ్లారు . రీసెంట్ గా ఆయన శ్రీవారిని దర్శించుకుని.. శ్రీవారి సన్నిధిలో మీడియా తో మాట్లాడారు . ఈ క్రమంలోనే మంచు మనోజ్ పెళ్లి తర్వాత ఫస్ట్ టైం మౌనిక రెడ్డి గురించి సంచలన కామెంట్స్ చేశారు . ఈ క్రమంలోని మంచు మనోజ్ మాట్లాడుతూ..”నాకు మౌనికకు పెళ్లి జరిగి వాళ్ళ ఇంటి నుంచి ..ఈ రోజే మేము తిరుమల కి వచ్చాము . శ్రీవారిని దర్శించుకున్నాం . దర్శనం చాలా చక్కగా జరిగింది . లైఫ్ లో ఏదైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమ ఓడిపోదని నేను గట్టిగా బలంగా నమ్ముతాను . ఫైనల్లీ అదే ప్రూవ్ అయింది”.

“మా నాన్నగారి బ్లెస్సింగ్స్ తో .. మా అక్క సపోర్ట్ తో నేను మౌనిక రెడ్డి ఒకటయ్యాము. మమ్మల్ని దీవించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు “అంటూ చెప్పుకోచ్చాడు. ఈ క్రమంలోనే తన పెళ్లి పిక్ని పోస్ట్ చేస్తూ “శివుని ఆజ్ఞ” అంటూ క్యాప్షన్ పెట్టిన మనోజ్ కు అదే ప్రశ్న ఎదురైంది. దీనిపై కూడా స్పందిస్తూ..” మనందరికీ తెలిసిందే శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా పుట్టదు అంటూ మన పెద్దలు చెప్తుంటారు. గత 12 ఏళ్లుగా మౌనిక నేను మంచి ఫ్రెండ్స్ .. మమ్మల్ని భార్యాభర్తలు గా మార్చాలి అని ఆ శివుడే అనుకున్నాడు . గత నాలుగేళ్లుగా మేము ఒకరిని ఒకరం ఇద్దరం అర్థం చేసుకున్నాం. ఫైనల్లీ ఒక్కటయ్యాం. మౌనిక బాబు గురించి చాలా ఆలోచించాం.. ఎలాగైనా జీవితంలో ముందుకెళ్లాలని భావించం. ఈ క్రమంలోనే ఆ శివుడే మమ్మల్ని ఈ దారిలో వెళ్ళమని సూచించారు. అందుకే పెళ్లి చేసుకున్నాం. అందరూ అంటుంటారుగా కలిసివచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తుంటారు అని.. బహుశా నా విషయంలో అదే జరిగిందేమో” అంటూ ఓపెన్ గానే మౌనిక రెడ్డి కొడుకు బాధ్యతలను తీసుకుంటున్నాను అంటూ స్ట్రాంగ్ గా నొక్కి చెప్పాడు మంచు మనోజ్ .

కాగా మంచు మనోజ్ తన అన్న విష్ణు పేరు చెప్పకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త డౌట్లు పుట్టిస్తుంది . ఈ పెళ్లి మొదటి నుంచి మంచు విష్ణుకి ఇష్టం లేదు అంటూనే ఉన్నారు సినీ జనాలు . ఇప్పుడు మరోసారి అదేవిధంగా ట్రెండ్ అవుతుంది. అయితే మంచు మనోజ్ రాజకీయాల్లోకి వస్తారా..? లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది..?